BigTV English

Sridevi: ఇతడు కేవలం 10 సెకన్లు శ్రీదేవికి భర్తగా నటించాడు.. కెరీర్ మొత్తం నాశనం, దేశాన్నీ వదిలేశాడు

Sridevi: ఇతడు కేవలం 10 సెకన్లు శ్రీదేవికి భర్తగా నటించాడు.. కెరీర్ మొత్తం నాశనం, దేశాన్నీ వదిలేశాడు


అతిలోక సుందరి శ్రీదేవికి అప్పట్లో ఉండే క్రేజే వేరు. ఆమె కేవలం దక్షిణాది సినిమాల్లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ నెంబర్ వన్ హీరోయిన్‌గా సినీ రంగాన్ని ఏలింది. ఆ స్థాయి హీరోయిన్‌తో మొదటి ఛాన్సులోనే నటించడం అంటే మాటలు కాదు. ఏ ఆర్టిస్టుకైనా అదో పెద్ద డ్రీమ్. అలాంటి అవకాశం దీపక్ మల్హోత్రా అనే నటుడికి దక్కింది. ఏకంగా ఆమెకు భర్తగా నటించే అవకాశం వచ్చింది. కానీ, అదే అతడి కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడే పాత్రని ఎవరూ ఊహించలేకపోయారు. అసలు ఎవరీ దీపక్ మల్హోత్రా? శ్రీదేవికి భర్తగా నటించడం వల్ల ఆయనకు ఎలాంటి సమస్య వచ్చింది? 

మోడలింగ్ నుంచి బాలీవుడ్‌కు..


దీపక్ మల్హోత్ర గురించి తెలుసుకోవాలంటే 1980 నాటి దశకంలోకి వెళ్లాలి. అప్పట్లో దీపక్ ఓ సూపర్ మోడల్. అతడు కర్ణాటక రాజధాని బెంగళూరులో 1964లో పుట్టాడు. అతడు కేవలం మోడల్ మాత్రమే కాదు.. జాతీయ స్థాయి జిమ్నాస్ట్ కూడా. అప్పట్లో అత్యధిక డిమాండ్, రెమ్యునరేషన్ అందుకొనే మోడల్స్‌లో దీపక్ కూడా ఒకడు. ఆ క్రేజే అతడిని బాలీవుడ్ వైపుకు నడిపించింది. అతడి, లుక్స్.. స్టైల్.. ప్రముఖ ఫిల్మ్ మేకర్ యాష్ చోప్రాను ఆకట్టుకుంది. దీంతో 1991లో అతడికి శ్రీదేవి నటించిన ‘లమ్హే’ (Lamhe) మూవీలో అవకాశం ఇచ్చారు. ఇందులో శ్రీదేవికి భర్తగా నటించాడు.

పది సెకన్లే, కానీ…

అయితే, అతడికి ఇచ్చి పాత్రమే కాదు. రెండున్నర గంటల సినిమాలో అతడి పాత్ర కనిపించేది 10 సెకన్లు మాత్రమే. అందులో శ్రీదేవి పాత్రపేరు పల్లబి భట్నాగర్, ఆమె భర్త పాత్ర పోషించిన దీపక్ పాత్ర పేరు సిద్ధార్థ్ భట్నాగర్. మూవీలోని ఒక సీన్‌లో శ్రీదేవి స్పృహతప్పి పడిపోతుంది. దీపక్ ఆమెను పైకి లేపి.. ప్రేమగా ఆమె చెంపను తాకుతాడు. అయితే, అతడు అలా చెయ్యడం ప్రేక్షకులకు నచ్చలేదు. సినీ విమర్శకులు పనిగట్టుకుని ఈ సీన్‌నే హైలెట్ చేసి మూవీపై నెగటివ్ ప్రచారం చేశారు. పత్రికల్లో కూడా అదే వచ్చింది. అప్పటికే దీపక్‌కు మోడల్‌గా మంచి పేరు ఉంది. కానీ, ఆ సీన్ వల్ల ఆ కెరీర్‌లోనూ నిలవలేకపోయాడు. బాలీవుడ్‌లోనూ ఛాన్సులు రాలేదు.

స్టార్ హీరో అయ్యే ఛాన్స్ మిస్

ఆ విమర్శల వల్ల దీపక్ చాలా ఇబ్బంది పడ్డాడు. కెరీర్ స్టార్టింగ్‌లోనే అలాంటి నెగటివ్ పబ్లిసిటీని తట్టుకోలేకపోయాడు. దీంతో ఒక పనికి మాలిన నిర్ణయం తీసుకున్నాడు. బంగారం లాంటి ఛాన్సులు వదులుకున్నాడు. 1992లో రాజీవ్ మెహ్రా తెరకెక్కించిన ‘చమత్కార్’ మూవీలో హీరో పాత్రను వదులుకున్నాడు. అందుకే సైడ్ క్యారెక్టర్ తీసుకున్నాడు. అతడు పక్కకి తప్పుకోవడం వల్ల ఆ ఛాన్స్ షారుఖ్‌ను వరించింది. అయితే, ‘లమ్హే’ మూవీలో వచ్చిన విమర్శల వల్ల యష్ చోప్రా దీపక్‌కు మరో ఛాన్స్ ఇచ్చేందుకు వెనకడుగు వేశారు. వాస్తవానికి 1993లో విడుదలైన ‘ఢర్’ మూవీలో హీరో అతడే. కానీ, యష్ చోప్రా అతడిని తొలగించి ఆ పాత్రను సన్నిడియోల్‌కు ఇచ్చారు. ఆ మూవీ ఏ స్థాయిలో హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవి మాత్రమే కాదు.. చాలా పెద్ద ప్రాజెక్టులను అతడు మిస్ చేసుకున్నాడు. అవన్నీ చేసి ఉంటే షారుఖ్ తరహాలోనే దీపక్ కూడా స్టార్ హీరో స్థాయిలో ఉండేవాడేమో.

కెరీర్ వదిలేసి విదేశాలకు…

ఇక్కడ అవకాశాలు దక్కవని భావించిన దీపక్.. దేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లిపోయాడు. అంతేకాదు తన ఐడెంటీని కూడా మార్చుకున్నాడు. డినో మార్టెల్లీ పేరుతో అక్కడ మొడలింగ్ రంగంలోకి ప్రవేశించాడు. అక్కడే స్థిరపడి కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు న్యూయార్క్‌లో ఉంటున్నాడు. సూపర్ మోడల్, కొరియోగ్రాఫర్ లుబ్నా ఆడమ్‌ను పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నాడు. అతడికి ఎదురైన చేదు అనుభవాల వల్లో ఏమో.. తన ఇద్దరు కొడుకులను సినీ రంగంలో కాకుండా.. తనకు మళ్లీ జీవితాన్ని అందించిన మోడిలింగ్‌‌ రంగానికే పరిచయం చేశాడు. ఏది ఏమైనా.. దీపక్ విషయంలో జరిగింది దారుణమే. కానీ, అమెరికాలో అతడికి కొత్త జీవితం లభించింది. అప్పట్లో సోషల్ మీడియా ఉండి ఉంటే.. మానసికంగా కుంగిపోయేవాడేమో. అతడి లక్ బాగుంది.

Also Read: Vidya Balan: నూడుల్స్ తిని నాతో రొమాంటిక్ సీన్ చేశాడు.. బ్రష్ చేయొచ్చు కదా? సీనియర్ హీరోపై విద్యాబాలన్ కామెంట్

Related News

Cm Revanth Reddy: చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లాలి

Anaganaga Oka Raju : వంశీ మామూలు ప్లానింగ్ కాదు, ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్

OG Ticket: ఏపీలో ‘ఓజి’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర తెలిస్తే షాకే!

Disha patani: దిశా పటాని ఇంటి ముందు కాల్పులు, నిందితులు ఎన్కౌంటర్

OG Censor : ఓజి సినిమా సెన్సార్ పూర్తి, కొత్త రికార్డులు ఖాయం

TG Viswa Prasad: విశ్వప్రసాద్ సరికొత్త రూటు… ఇక ఇండస్ట్రీకి మంచి రోజులే

Manchu Lakshmi: ఆమె నా రోల్ మోడల్.. ట్విస్ట్ ఇచ్చిన మంచు లక్ష్మీ!

Manchu Lakshmi: మనోజ్ రీ ఎంట్రీ వెనుక ఇంత కథ ఉందా.. మంచు లక్ష్మీ ఏమన్నారంటే?

Big Stories

×