E-Paper
Advertisement

Mirai Song Promo: వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉందిలే..

Mirai Song Promo: వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉందిలే..
Advertisement

Mirai Song Promo: కుర్ర హీరో తేజ సజ్జా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటుడిగా కెరీర్ ను ప్రారంభించిన తేజ ఆ తరువాత ఓ బేబీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఈ సినిమాలో సపోర్టివ్ రోల్ తో అదరగొట్టిన తేజ.. అద్భుతం, జాంబీ రెడ్డి, ఇష్క్ సినిమాలతో  హీరోగా మారిన తేజ.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్  రాబట్టింది.

 

Advertisement

ఇక హనుమాన్ తరువాత తేజ సజ్జా నటిస్తున్న చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తేజ సరసన రిత్విక నాయక్ నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూపర్ యోధ పాత్రలో తేజ నటిస్తున్నాడు. సెప్టెంబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Advertisement

మిరాయ్ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. వైబ్ ఉంది పిల్లా.. వైబ్ ఉందిలే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. గౌర హరి మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఇక సాంగ్ లో తేజ డ్యాన్స్ హైలైట్ ఉండబోతుందని తెలుస్తోంది. చాలా స్టైలిష్ లుక్ లో తేజ.. అందాలను ఆరబోస్తూ రిత్విక కనిపించారు.  జూలై 26 న  ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

 

కేవలం ప్రోమోతోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. నిజంగానే ఈ సాంగ్ లో వైబ్ ఉందని తెలుస్తోంది. ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాకా కచ్చితంగా  ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో తేజ సజ్జా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×