BigTV English

Vidya Balan: నూడుల్స్ తిని నాతో ముద్దు సీన్ చేశాడు.. బ్రష్ చేయొచ్చు కదా? సీనియర్ హీరోపై విద్యాబాలన్ కామెంట్

Vidya Balan: నూడుల్స్ తిని నాతో ముద్దు సీన్ చేశాడు.. బ్రష్ చేయొచ్చు కదా? సీనియర్ హీరోపై విద్యాబాలన్ కామెంట్


Vidya Balan Comments on Sanjay Dutt: బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీలో ఎన్నో హిట్, సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ది డర్టి పిక్చర్ చిత్రంతో నార్త్ లోనే కాదు సౌత్ లోనూ గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ బ్యూటీ, అలనాటి బోల్డ్ బ్యూటీ సిల్స్ స్మిత జీవిత కథ ఆధారం తెరకెక్కిన ఈ సినిమా విద్యా బాలన్ లీడ్ రోల్ పోషించింది. ఈ పాత్రలో ఆమె దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆమె నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు నార్త్ ఎన్నో బోల్డ్ పాత్రల్లో నటించిన విద్యా బాలన్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు..


అయితే ప్రస్తుతం ఆమెకు పెద్దగా అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. ఆడపదడప చిత్రాలు, పెద్ద సినిమాల్లో అతిథి పాత్రలు చేస్తోంది. అయితే ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం పరిణిత. ఈ సినిమా విడుదలైన 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఓ హాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన విశేషాలను పంచుకుంది. అలాగే చిత్రంలో హీరోగా నటించిన సంజయ్ దత్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. పరిణితతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది విద్యాబాలన్. ప్రదీప్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ లు ప్రధాన పాత్రలు పోషించారు.

సంజయ్ దత్ ముద్దు సీన్

రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్ మధ్య కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. ఈ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో హీరో సంజయ్ దత్ వల్ల తనకు చేదు అనుభవం ఎదురైందని చెప్పింది. ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ముందు దీనికి కోసం మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారా? అని అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ ఇలా చెప్పిది. నటీనటులు ఎవరైనా.. ఇలాంటి సన్నివేశాలు చేయడానికి ముందు వారి నోరు, పళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం బేసిక్ మ్యానర్స్ అని చెప్పింది. అయితే ఈ సీన్ హీరో ఎలాంటి శుభ్రతను పాటించలేదు. అదీ నాకు ఎంతో అసౌకర్యంగా అనిపించిందంటూ ఊహించని కామెంట్స్ చేసింది.

బ్రష్ కూడా చేయలేదు..

‘మనలో చాలా మంది శరీర దుర్వాసన గురించి ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే దానివల్ల ఎదుటివారు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి విషయాల పట్ల కనీస అవగాహనతో ఉండాలి. ముఖ్యంగా నటీనటులు. ఎందుకంటే ఓ నటుడి వల్ల నేను ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను. పరిణిత మూవీలో హీరోహీరోయిన్ల మధ్య ముద్దు సీన్ ఉంటుంది. ఆ సీన్ షూటింగ్ టైంలో ఆ హీరో(సంజయ్ దత్) కనీస శుభ్రత కూడా పాటించలేదు. చైనీస్ ఫుడ్ నూడుల్స్ తిని అలాగే షూటింగ్ కి వచ్చేసాడు. కనీసం అతను బ్రష్ చేయలేదు కదా.. మౌత్ ఫ్రెష్ కూడా తీసుకోలేదు. అప్పుడు ఆయన నోటి నుంచి వస్తున్నదుర్వాస వల్ల చాలా అసౌకర్యంగా అనిపించింది. ఆ సీన్ చేస్తున్నప్పుడ నా మైండ్ ఒక్కటే ఆలోచన. ఆయన భార్య పరిస్థితి ఎంటా అనిపించింది. తను ఎంతగా అడ్జెస్ట్ అవుతుందో అని ఆలోచించాను. అదే నా తొలి చిత్రం. ఇండస్ట్రీకి కొత్త కావడంతో నా అసౌకర్యాన్ని అతడితో చెప్పలేకపోయాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ బి టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Also Read: Niharika Konidela: వానలో.. నల్ల చీరలో నడుము అందాలు చూపిస్తూ.. నిహారిక అరాచకం, ఇది ఎక్స్‌పెక్ట్ చెయ్యలే!

Related News

RGV: వర్మపై మరో కేసు ఫైల్.. తప్పుదోవ పట్టించారంటూ?

Cm Revanth Reddy: చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లాలి

Anaganaga Oka Raju : వంశీ మామూలు ప్లానింగ్ కాదు, ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్

OG Ticket: ఏపీలో ‘ఓజి’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర తెలిస్తే షాకే!

Disha patani: దిశా పటాని ఇంటి ముందు కాల్పులు, నిందితులు ఎన్కౌంటర్

OG Censor : ఓజి సినిమా సెన్సార్ పూర్తి, కొత్త రికార్డులు ఖాయం

TG Viswa Prasad: విశ్వప్రసాద్ సరికొత్త రూటు… ఇక ఇండస్ట్రీకి మంచి రోజులే

Manchu Lakshmi: ఆమె నా రోల్ మోడల్.. ట్విస్ట్ ఇచ్చిన మంచు లక్ష్మీ!

Big Stories

×