iQOO Z10R 5G: iQOO నుంచి అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ విడుదల అయ్యింది. iQOO Z10R 5G పేరుతో దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. తక్కువ ధర, సూపర్ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ మీడియా టెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో రూ. 20,000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి రాబోతోంది. 12GB ర్యామ్, కర్వ్డ్ డిస్ ప్లే, 50MP మెయిన్ కెమెరా, డ్యూయల్ IP రేటింగ్ తో ప్రీమియం డిజైన్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఆఫర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
iQOO Z10R స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
iQOO Z10R మీడియా టెక్ డైమెన్సిటీ 7400 చిప్ సెట్ తో వస్తోంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. iQOO Z10R లోని వర్చువల్ మెమరీ ఫీచర్ ని ఉపయోగించి ర్యామ్ ను మరో 12GB వరకు ఎక్స్ టెండ్ చేసుకోవచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్టు చేసే క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం లుక్ లో కనిపించినప్పటికీ, ఫ్లెక్సిబుల్ స్క్రీన్ ప్రొటెక్టర్ల అడ్జెస్ట్ కావాల్సి ఉంటుంది. మిగిలిన డిజైన్ విషయానికొస్తే, ఫోన్ పాలికార్బోనేట్ తో తయారయ్యింది.
అదిరిపోయే కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ
iQOO Z10R కెమెరా విషయానికొస్తే, సోనీ IMX882 50MP సెన్సార్ ను కలిగి ఉంది. ఇది Vivo X200 లాంటి టాప్ మోబైల్ ఫోన్లలో కనిపిస్తుంది. 2MP డెప్త్ సెన్సార్, ఆరా లైట్ సెల్ఫీ రింగ్ కూడా ఉంటుంది. ఇక సెల్ఫీల విషయానికొస్తే, 4K వీడియోను రికార్డ్ చేసే 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక 5700mAh బ్యాటరీ యూనిట్ ను కలిగి ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. Android 15 ఆధారంగా పనిచేసే Funtouch OS 15ను కలిగి ఉంటుంది. ఫోన్ లో ఆప్టికల్ అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. గూగుల్ సర్కిల్ టు సెర్చ్, AI నోట్ అసిస్ట్, AI స్క్రీన్ ట్రాన్స్ లేషన్, AI ట్రాన్స్ క్రిప్షన్ అసిస్ట్ లాంటి AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
iQOO Z10R ధర ఎంతంటే?
iQOO Z10R ధర విషయానికి వస్తే.. 8GB + 128GB మోడల్ ధర రూ. 19,499 ఉండగా, ప్రారంభ ఆఫర్ గా ధర రూ. 17,499కి అందిస్తోంది. ఇన్ స్టంట్ డిస్కౌంట ద్వారా రూ. 2, 000 తగ్గింపు ధరలో పొందవచ్చు. ఇక 8GB + 256GB మోడల్ అసలు ధర రూ. 21,499 కాగా, రూ. 19,499కి అందిస్తుంది. టాప్-ఎండ్ 12GB + 256GB మోడల్ ధర విషయానికొస్తే, దీని ధర రూ. 23,499 కాగా, రూ. 21,499కి అందిస్తోంది. 6 నెలల నో-కాస్ట్ EMIలోనూ పొందే అవకాశం ఉంది. HDFC, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి రూ. 2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంది. iQOO Z10R అమ్మకాలు జూలై 29న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.
Read Also: త్వరలోనే ఐఫోన్ ఫోల్డ్.. ఆన్‌లైన్‌లో ఫీచర్లు లీక్.. అత్యంత ఖరీదైన ఫోన్ ఇదే