E-Paper
Advertisement

రజినీకాంత్ రెమ్యునరేషన్ ఒక్క రూపాయి మాత్రమేనట.. ఆ నిర్మాత చెప్పింది వింటే ఫ్యూజుల్ ఔట్!

రజినీకాంత్ రెమ్యునరేషన్ ఒక్క రూపాయి మాత్రమేనట.. ఆ నిర్మాత చెప్పింది వింటే ఫ్యూజుల్ ఔట్!
Advertisement

Rajinikanth: ప్రస్తుతం భారతీయ సినిమా మార్కెట్ ఊహించని రీతిలో విస్తరించింది.ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు వసూలు సాధించడం అంటే చాలా గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు 1000కోట్ల క్లబ్ ని కూడా చాలా సునాయాసంగా టచ్ చేస్తున్నాయి పాన్ ఇండియా సినిమాలు. ఈ క్రమంలోనే స్టార్ హీరోల పారితోషకాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. అయితే కేవలం ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ మాత్రమే ఆశించకుండా చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యలుగా మారుతూ నిర్మాతల భారాన్ని తగ్గించే సరికొత్త పంథాకి హీరోలు తెర లేపుతుండడం గమనార్హం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ , రామ్ చరణ్, మహేష్ బాబు వంటి హీరోలు తమ పారితోషకాల విషయంలో ప్యాకేజీ పద్ధతిని పాటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు పరిమితంగా అడ్వాన్స్ తీసుకొని సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాలలో వాటాలు తీసుకోవడం ద్వారా నిర్మాతకు కూడా వెసులుబాటు కలుగుతుంది అనడంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విధానం వల్ల సినిమా నిర్మాణ సమయంలో నిర్మాత పై వడ్డీల భారం తగ్గడమే కాకుండా సినిమా విజయంలో హీరోకి కూడా బాధ్యత పెరుగుతుంది అనేది వాస్తవం.

రెమ్యూనరేషన్ విషయంలో రజనీకాంత్ కొత్త పంథా..

ఇకపోతే దక్షిణాదిలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ పారితోషకం విషయంలో పాటిస్తున్న నిబద్ధత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన నటుడు గానే కాకుండా నిర్మాతలకు అండగా నిలిచిన మొదటి తరం స్టార్ గా ఇప్పుడు గుర్తింపు పొందుతున్నారు. తాజాగా నిర్మాత జి ధనుంజయ్ తెలిపిన ప్రకారం రజనీకాంత్ గతంలో ఒక సినిమా కోసం కేవలం ఒక రూపాయి మాత్రమే అడ్వాన్స్ గా తీసుకొని షూటింగ్లో పాల్గొనేవారు. సినిమా విజయం సాధించిన తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకునేలా ఆయన ఒప్పందాలు చేసుకున్నారు. నిర్మాతకు నష్టం రాకూడదనే ఆయన ప్రధాన ఉద్దేశం అంటూ తెలిపారు. ఇకపోతే రజినీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న వేళ అటు అల్లు అర్జున్ కూడా ఇదే స్ఫూర్తిని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

షేరింగ్ ప్రాఫిట్ పై ప్రశంసలు.

Advertisement

దర్శకుడు అట్లీతో భారీ బడ్జెట్ మూవీ రాకా కోసం బన్నీ కూడా కేవలం ఒక రూపాయి అడ్వాన్సుగా తీసుకొని మిగతా మొత్తాన్ని లాభాలలో వాటాగా తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక సినిమా లాభాలలో వచ్చే ప్రతి రూపాయికి 30 పైసల వాటా బన్నీ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ ఖాన్ లు కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు సౌత్ హీరోలు కూడా ఇదే నిర్ణయానికి కట్టుబడుతుండడంతో నిర్మాతలకు వడ్డీల భారం తగ్గుతుందని చెప్పాలి. ఒకవేళ సినిమా హిట్ అయితే రెమ్యూనరేషన్ ఎక్కువ వస్తుంది .ఆడకపోతే నిర్మాత నష్టపోకుండా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.

ALSO READ:Tollywood: సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. అసలు కారణం తెలిస్తే షాక్!

భవిష్యత్తులో ఆర్థిక నష్టాలు ఉండవు..

Advertisement

ఇకపోతే నిర్మాతలపై ఆర్థిక భారం పడకుండా సినీ సెలబ్రిటీలు తీసుకుంటున్న ఈ నిర్ణయాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ ప్రారంభించిన ఈ ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిని అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియా స్టార్స్ కొనసాగించడం వల్ల రానున్న రోజుల్లో కూడా మరిన్ని భారీ ప్రాజెక్టులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్టార్ హీరోలు భారీ ఫిక్స్డ్ పారితోషకాల కంటే లాభాలలో వాటా తీసుకోవడం వల్ల సినిమా క్వాలిటీ బాక్సాఫీస్ విజయంపై సానుకూల ప్రభావం ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×