భారతీయ రైల్వేలో ప్రమాదాలకు చోటు లేకుండా రైల్వే అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రమాదాలు లేని ప్రయాణాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కవచ్ లాంటి వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, తాజాగా జరిగిన రెండు రైలు ప్రమాదాలు ప్రయాణీకులను భయభ్రాంతులకు గురి చేశాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోయినా.. ప్రాణాలు పోయినంత పని అయ్యింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తాజాగా కేవలం గంట వ్యవధిలో ఒకే రైలు నుంచి రెండు సార్లు బోగీలు విడిపోయిన ఘటనలు సంచలనం కలిగించాయి. మహారాష్ట్ర, గుజరాత్ లో ఈ ఘటనలు జరిగాయి. బాంద్రా టెర్మినస్-అమృత్సర్ పశ్చిమ్ ఎక్స్ ప్రెస్ కోచ్‌లను ప్రయాణ సమయంలో రెండుసార్లు విడిపోయాయి. మొదటిసారి మధ్యాహ్నం 1:19 గంటలకు మహారాష్ట్రలోని వంగావ్- దహను స్టేషన్ల మధ్య రైలు నుంచి బోగీలు విడిపోయాయి. వాటిని అధికారులు మళ్లీ జాయింట్ చేశారు. సుమారు గంట వ్యవధిలో అంటే.. మధ్యాహ్నం 2:10 గంటలకు గుజరాత్ లోని సంజన్ స్టేషన్ లో మరోసారి విడిపోయాయి. వరుస ఘటనలతో అందరూ షాక్ కు గురయ్యారు.
ఈ ఘటనల్లో ప్రయాణీకులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోయినా, భయంతో వణికిపోయారు. “ఈ ఘటనల్లో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ, ప్రయాణీకులు తీవ్రంగా భయపడ్డారు. సకాలంలో స్పందించి మరమ్మతులు చేయడం వల్ల రైల్వే కార్యకలాపాల మీద ఎటువంటి ప్రభావం చూపలేదు” అని పశ్చిమ రైల్వే ప్రతినిధులుత ఎలిపారు. తొలిసారి కోచ్ లను తిరిగి కలపడం కోసం రైలును దాదాపు 25 నిమిషాలు నిలిపివేయాల్సి వచ్చింది. మధ్యాహ్నం 1.46 గంటలకు రైలు బయల్దేరేందుకు అధికారులు అనుమతించారు. అటు సంజన్ స్టేషన్ లో రైలు మరోసారి కనెక్షన్ విడిపోయింది. వల్సాద్ నుంచి క్యారేజ్, వ్యాగన్ సిబ్బంది వచ్చి మరోసారి మరమ్మతులు చేశారు. మధ్యాహ్నం 3:15 గంటలకు వల్సాద్ నుంచి రైలు మళ్లీ బయల్దేరింది.
Read Also: వందేభారత్ లో ఎక్స్ పైరీ ఫుడ్, నిప్పులు చెరిగిన ప్రయాణీకులు, పోలీసుల ఎంట్రీ..
రైలు నుంచి బోగీలు విడిపోయిన ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోయినా, భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో రైలు రాకపోకలు కాస్త ఆలస్యం అయ్యాయి. అయితే, రైల్వే కోచ్ లు గంట వ్యవధిలో రెండుసార్లు విడిపోవడం పట్ల అధికారులు సీరియస్ అయ్యాయి. ఎందుకు ఇలా జరిగింది? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. అదే సమయంలో పూర్త వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు మొదలు పెట్టారు. మరోవైపు సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Also: ట్రైన్ లో నుంచి దూసుకొచ్చిన టెంకాయ.. ట్రాక్ పక్కన నడుస్తున్న వ్యక్తి తలకు తగిలి..