E-Paper
Advertisement

The Kerala story: కేరళ స్టోరీ కల్పితం కాదు నిజమే అంటున్న బాధితురాలు.. వీడియో వైరల్!

The Kerala story: కేరళ స్టోరీ కల్పితం కాదు నిజమే అంటున్న బాధితురాలు.. వీడియో వైరల్!
Advertisement

The Kerala story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదల సమయం నుండి ఎన్నో వివాదాలు, మరెన్నో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కల్పితమని కొందరు వాదిస్తుంటే, లేదు ఇది పచ్చి నిజం అని మరికొందరు చెబుతున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన అనగ అనే మహిళ తాను స్వయంగా బాధితురాలినంటూ సోషల్ మీడియా వేదికగా బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. సినిమాలో చూపించిన సంఘటనలు తన జీవితంలో కూడా జరిగాయని ఆమె చెబుతున్న మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి..

హాస్టల్ గదుల్లో మతమార్పిడి ఉచ్చు:

త్రిషూర్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్ అనగ తన వీడియోలో వెల్లడించిన విషయాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఉన్నత చదువుల కోసం ఎర్నాకులం వెళ్ళినప్పుడు, హాస్టల్‌లో తన రూమ్ మేట్స్ ద్వారా మతమార్పిడి ప్రయత్నాలు జరిగాయని ఆమె వాపోయింది. సరిగ్గా సినిమాలో శాలిని ఉన్నికృష్ణన్ పాత్రకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో, తన జీవితంలో కూడా అవే జరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం మాటలతో మొదలై, నెమ్మదిగా మనసు మార్చే వరకు ఆ ప్రక్రియ ఎలా సాగుతుందో ఆమె కళ్ళకు కట్టినట్లు వివరించింది.

మైండ్ గేమ్ తో మాయ:

Advertisement

మతమార్పిడి చేసేవారు ముందుగా మతంపై లేనిపోని ప్రశ్నలు అడిగి మనల్ని గందరగోళానికి గురిచేస్తారని అనగ పేర్కొంది. మన నమ్మకాలను మనమే ప్రశ్నించుకునేలా చేసి, ఆ తర్వాత వారి మత గ్రంథాలను చేతిలో పెడతారని వివరించింది. ఆ మాయలో పడిన వారు ఎంతలా మారిపోతారంటే, తమ సొంత మతాన్ని, ఆచారాలను వారే కించపరుచుకునే స్థాయికి వెళ్తారని ఆమె హెచ్చరించింది. ఇదొక వ్యూహాత్మకమైన మైండ్ గేమ్‌ అని, అప్రమత్తంగా లేకపోతే ఎవరైనా ఆ ట్రాప్‌లో పడిపోయే ప్రమాదం ఉందని ఆమె గుర్తు చేసింది.

also read:Divi Vadthya: స్ట్రీట్ షాపింగ్ తో బిజీగా మారిన దివి.. ఆ మెరుపు చూసారా?

బయటపడటం ఓ అదృష్టం:

Advertisement

ఇక తాను దేవుడి దయవల్ల ఆ ఉచ్చు నుండి క్షేమంగా బయటపడగలిగానని, కానీ అందరికీ ఆ అవకాశం ఉండకపోవచ్చని అనగ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చదువుల కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే యువతులు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి మాటలు నమ్ముతున్నారు అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరింది. ‘ది కేరళ స్టోరీ’ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, అది సమాజంలో జరుగుతున్న వాస్తవాలకు ప్రతిరూపమని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. వివాదాలు ఎలా ఉన్నా, ఇలాంటి అనుభవాలు బయటకు రావడం సమాజంలో భద్రతపై కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది.

Related News

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. స్టార్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు!

రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?.. అస్సలు ఊహించలేరు..

‘బ్లాస్ట్’ బ్యూటీని పట్టేసిన శ్రీను వైట్ల.. హీరోయిన్ సెలెక్షన్ ఓకే కానీ, ఆ రిలీజ్ డేట్ రిస్కేనా?

Maa Inti Bangaaram Twitter Review: ‘మా ఇంటి బంగారం ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

అబ్బాయ్ కోసం తప్పుకున్న బాబాయ్.. ‘పెద్ది’ వల్ల ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ వాయిదా!

Vanda Devullu : విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ రివ్యూ: బిచ్చగాడు రేంజ్ ఉందా?

నాగ్ ‘KING 100’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రంగంలోకి దిగిన కన్నడ రియల్ స్టార్

బాహుబలి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదుగా.. ఫ్రాన్స్‌లో ప్రభాస్ యానిమేషన్ సినిమా సెన్సేషన్!

Big Stories

Advertisement
×