E-Paper
Advertisement

Maa Inti Bangaaram Twitter Review: ‘మా ఇంటి బంగారం ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Maa Inti Bangaaram Twitter Review: ‘మా ఇంటి బంగారం ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Advertisement

Maa Inti Bangaaram Twitter Review: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు వెతుకుతూ తనలోని టాలెంట్ నేను నిరూపించుకుంటూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. సమంత నటించిన ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం ఇవాళ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది.. సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఇందులో కీలక పాత్రలో శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్ వంటి నటీనటులు నటిస్తున్నారు. ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ టాక్ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో ఒకసారి చూసేద్దాం..

సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా మీ కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా చూసే సినిమా. ఎంగేజింగ్‌గా ఉండే యాక్షన్ సినిమా. గూస్ బంప్స్‌తో కూడిన యాక్షన్ బ్లాక్స్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిల్లియంట్‌గా ఉంది. సమంత రుత్ ప్రభు నిజంగా లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌కు అర్హురాలు. ఈ బంగారం సినిమాతో వాస్తవంగా బిగ్ బ్యాంగ్ ఇచ్చింది. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

Advertisement

సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ కంప్లిట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ.. మాస్ ఎలిమెంట్స్ కలిపినట్లు ఉంది. సమంత ఈసారి ఉతికి ఆరేసింది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ అదిరిపోయాయి.. ఇక క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలం తర్వాత ఇలాంటి మంచి సినిమాని చూస్తున్నాము అని మరో నిజను ట్వీట్ చేశారు..

Advertisement

సమంత మా ఇంటి బంగారం సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది.. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఆసక్తిని కలిగించే సన్నివేశాల కొరత కారణంగా సినిమాపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. భావోద్వేగాలు అరుదుగా పండిస్తాయి.. కాస్త రొటీన్ స్టోరీలాగే అనిపించింది. సమంత తన పాత్రలో చక్కగా నటించింది. మ్యూజిక్ కూడా పర్వాలేదనిపించింది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

మొత్తానికి సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా ఇవాళ థియేటర్లోకి వచ్చేసి మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. సమంత గతంలో నటించిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా ఉండడంతో ఎక్కువ మంది జనాలు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎన్నడూ కనిపించిన విధంగా సమంత ఇందులో కనిపించడంతో అందరూ కూడా సినిమాని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరోవైపు సినిమాపై అక్కడక్కడ మైనస్లు ఉన్నాయి అంటూ కొందరు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి ఇప్పటివరకైతే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మరి మా ఇంటి బంగారం మూవీ కలెక్షన్స్ ఏమాత్రం వసూల్ అవుతాయో చూడాలి..

Related News

బాలయ్య ‘దాదా’ నుంచి బిగ్ అప్డేట్.. థమన్ చెప్పింది ఇదే!

జైలర్ 2లో స్టార్‌ల జాతర.. రజనీకి తోడుగా ఇంతమందా?

మిర్జాపూర్‌కు సీక్వెల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే..

హీరోల్లో అతడే బాగా ఫ్లర్ట్ చేసేవాడు.. జయప్రద కామెంట్స్ వైరల్ !

ప్రభాస్ హీరోయిన్ గ్లామర్ షో..కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా!

రష్మికను ఇలా ఎప్పుడైనా చూశారా? ‘మైసా’ టీజర్ దిమ్మతిరిగేలా!

రూ.13 కోట్ల కారు.. మైథిలీపై ట్రోలింగ్.. కంగనా ఫైర్!

పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!

Big Stories

Advertisement
×