E-Paper

నాగ్ ‘KING 100’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రంగంలోకి దిగిన కన్నడ రియల్ స్టార్

నాగ్ ‘KING 100’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రంగంలోకి దిగిన కన్నడ రియల్ స్టార్
Advertisement

Lottery King: టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం (King 100) ప్రస్తుతం జోరుగా  షూటింగ్ జరుపుకుంటోంది. ఎలాంటి హడావుడి లేకుండా, సైలెంట్ కాన్సెప్ట్‌తో సెట్స్ పైకి తీసుకెళ్లిన ఈ ల్యాండ్‌మార్క్ మూవీ గురించి రోజుకో క్రేజీ న్యూస్  ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో కన్నడ ‘రియల్ స్టార్’ ఉపేంద్ర ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు గట్టి టాక్ వినిపిస్తోంది.

కన్నడ స్టార్ అయినప్పటికీ ఉపేంద్రకు తెలుగులో కల్ట్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆయన నటించిన ‘ఎ’, ‘ఉపేంద్ర’ వంటి సినిమాలు ఇక్కడ సంచలన విజయం సాధించాయి. ‘S/o సత్యమూర్తి’, ‘గని’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఉపేంద్ర.. రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలోనూ మెరిసిన సంగతి తెల్సిందే. ఇప్పుడు నాగ్ 100వ సినిమాలో ఆయన పాత్ర సినిమాకు మెయిన్ అసెట్ గా  నిలవబోతున్నాడని సమాచారం.

‘రాగ్స్ టు రిచ్’ కాన్సెప్ట్‌

Advertisement

ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా  అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, ‘మనం ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్, సుష్మితా భట్ కథానాయికలుగా నటిస్తుండగా.. సీనియర్ బ్యూటీ టబు ఒక ప్రత్యేకమైన పాత్రలో మెరవనుంది. ఇప్పుడు వీరితో పాటు ఉపేంద్ర కూడా తోడవ్వడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

Also read :బాస్ జేబుకు రూ. 2.5 లక్షల చిల్లు పెట్టిన ఎంప్లాయ్.. జెరోధా ఆఫీస్‌లో జరిగిన క్రేజీ స్టోరీ

Advertisement

ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ‘రాగ్స్ టు రిచ్’ (పేదవాడి నుంచి సంపన్నుడిగా మారే) కాన్సెప్ట్‌తో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నాగార్జున విభిన్నమైన గెటప్స్, వింటేజ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్ ఇవ్వబోతున్నారట. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సినిమాకు మరో పెద్ద అసెట్

అయితే ‘లాటరీ కింగ్’ కాన్సెప్ట్, నాగ్ వింటేజ్ లుక్స్ అనగానే ఫ్యాన్స్‌లో పాత నాగార్జునను చూస్తామనే నమ్మకం కలగడం పెద్ద ప్లస్ పాయింట్. అలాగే టబు, ఉపేంద్ర, ఐశ్వర్య రాజేష్ వంటి పెర్ఫార్మర్స్‌ను ఎంచుకోవడం సినిమాకు జాతీయ స్థాయిలో మైలేజ్ తెచ్చిపెడుతుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ లాంటి మాస్ పల్స్ తెలిసిన సంగీత దర్శకుడు దొరకడం సినిమాకు మరో పెద్ద అసెట్ అని చెప్పాలి.

కానీ  నాగార్జున తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా బాధ్యతలను  తక్కువ అనుభవం ఉన్న రా. కార్తీక్ చేతుల్లో పెట్టడం కాస్త రిస్క్ అనే చెప్పాలి. గతంలో పలువురు సీనియర్ హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నారు కూడా.మరోవైపు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ వినడానికి కాస్త పాతకాలం నాటి మాస్ సినిమాగా అనిపిస్తోందని, ఇప్పటి ట్రెండ్‌కు ఇలాంటి టైటిల్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతాయా అనేది సందేహమే.

బాక్సాఫీస్ వద్ద ఎలాంటి జాక్‌పాట్ కొడతాడో

వీటన్నిటికీ తోడు రిలీజ్ డేట్ కూడా పెద్ద సవాల్‌గా మారేలా ఉంది. 2027 సంక్రాంతి రేసులో ఇప్పటికే పలువురు స్టార్ హీరోల పాన్ ఇండియా చిత్రాలు క్యూ కట్టే అవకాశం ఉంది. మరి ఆ హెవీ కాంపిటీషన్ మధ్య ఈ ‘కింగ్’ ఎంతవరకు తట్టుకుంటాడో చూడాలి. ఏదేమైనా 100వ సినిమా విషయంలో నాగార్జున తీసుకుంటున్న కేర్, సెలెక్ట్ చేసుకుంటున్న నటీనటులు చూస్తుంటే ఈ సినిమా టాలీవుడ్‌లో ఒక స్పెషల్ మూవీగా నిలిచేలానే ఉంది. మరి ఈ ‘లాటరీ కింగ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి జాక్‌పాట్ కొడతాడో వేచి చూడాల్సిందే.

Related News

బాహుబలి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదుగా.. ఫ్రాన్స్‌లో ప్రభాస్ యానిమేషన్ సినిమా సెన్సేషన్!

NTR 31.. ‘డ్రాగన్’ లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్.. ప్రశాంత్ నీల్ ఆ రిస్క్ దాటుతాడా?

కృతి శెట్టితో శంకర్ కొడుకు రొమాన్స్.. ‘లవర్ బాయ్’గా అర్జిత్ గ్రాండ్ ఎంట్రీ!

మణికొండ మొత్తం కొనేసేవాడిని.. ఓవర్ కాన్ఫిడెన్స్ ముంచేసింది.. ‘చిత్రం’ శ్రీను షాకింగ్ కామెంట్స్!

షాకింగ్ సర్ప్రైజ్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘స్పైడర్‌మ్యాన్’ కపుల్!

సెక్యూరిటీలో ‘మహిళా బౌన్సర్’.. తలపతి విజయ్ క్రేజీ డెసిషన్ వైరల్

మెగాస్టార్ 158 సెట్స్ లోకి ఎంట్రీ.. భారీ అంచనాలు, అంతకుమించిన అనుమానాలు!

×