E-Paper

Vanda Devullu : విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ రివ్యూ: బిచ్చగాడు రేంజ్ ఉందా?

Vanda Devullu : విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ రివ్యూ: బిచ్చగాడు రేంజ్ ఉందా?
Advertisement

Vanda Devullu : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అంటోనీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈయన తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. బిచ్చగాడు అంటే సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈ హీరో ఇప్పుడు వంద దేవుళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో ఒకసారి చూసేద్దాం..

అరేయ్ గ్యాంగ్.. సడన్ గా మన ‘బిచ్చగాడు’ విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ శశి కాంబినేషన్ అనగానే మనోళ్లు థియేటర్ల దగ్గర ఏదో ఊహించుకొని పోయిండ్రు! కానీ ఈసారి విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ అంటూ అమ్మ సెంటిమెంట్ తోటి మన గుండెలను హత్తుకున్నాడా? లేక థియేటర్లలో బోర్ కొట్టించి నిద్రపుచ్చాడా? అసలు ఈ సినిమా ముచ్చట ఎట్లుందో రివ్యూలో చూసేద్దాం..

కథ ఏందంటే?:

Advertisement

కథ పెద్దగా ఏం లేదు భయ్యా.. భర్త చనిపోయాక ఊరి జనాలు అనే సూటిపోటి మాటలు భరించలేక, తన ఇద్దరు కొడుకుల కోసం బతికే ఓ ఒంటరి తల్లి వాసవి (శ్వాసిక). సమాజం పెట్టే టార్చర్‌ తట్టుకోలేక, కొడుకులు పెద్దయ్యాక ఆమె ‘మళ్లీ పెళ్లి’ చేసుకోవాలని డిసైడ్ అవుతుంది.

అరేయ్.. మన చిన్నప్పుడు జగపతిబాబు ‘మా నాన్నకు పెళ్లి’ అని నాన్నకు పెళ్లి చేసిండు కదా.. ఇక్కడ రివర్స్ అన్నమాట, మా అమ్మకు పెళ్లి’కాన్సెప్ట్! మరి ఈ అమ్మ పెళ్లి నిర్ణయాన్ని కొడుకులు ఒప్పుకున్నారా? బంధువులు ఎలాంటి పంచాయితీలు పెట్టిండ్రు? ఈ కథలోకి మన విజయ్ ఆంటోనీ ‘ఏడుకొండలు’ క్యారెక్టర్ ఎలా ఎంట్రీ ఇచ్చింది? చివరికి అమ్మ పెళ్లి జరిగిందా లేదా? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్లు:

Advertisement

హీరోయిన్ శ్వాసిక వన్-మెన్ షో: విజయ్ ఆంటోనీ సినిమా అన్నాం కానీ.. ఈ సినిమాకి అసలైన హీరో శ్వాసికనే భయ్యా! ఒక ఒంటరి తల్లిగా, వితంతువుగా ఆమె పలికించిన ఎమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక అమ్మ కూడా మనిషే అనే పాయింట్: దేవతలు, వంద దేవుళ్లు అని అమ్మని ఒక రాయిలా చూడకుండా.. ఆమెకూ ఒక మనసుంటుంది, జీవితం ఉంటుంది అని చెప్పిన పాయింట్ ఆలోచింపజేసేలా ఉంటది. ఇక్కడ డైరెక్టర్ శశి గారు కూడా సెంటిమెంట్ ని గట్టిగానే దట్టించిండు.

సెకండాఫ్ కామెడీ: క్లైమాక్స్ లో వచ్చే ఉపన్యాసాలు కాకుండా.. హాస్య కోణంలో, యూట్యూబ్ కంటెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్లు థియేటర్‌లో మంచి నవ్వులు పూయిస్తాయి.

మైనస్ పాయింట్లు :

విజయ్ ఆంటోనీ ఎక్కడ ఉన్నాడు భయ్యా? సినిమా పోస్టర్ మీద విజయ్ ఆంటోనీ బొమ్మ చూసి, ఆయన కోసం థియేటర్‌కి వెళ్తే.. ప్రథమార్ధంలో ఆయన కంటే ఎక్కువ ఆయన మేనల్లుడు అజయ్ దీషనే కనిపిస్తాడు! విజయ్ ఆంటోనీ కథను ముందు పెట్టి, తాను వెనక్కి వెళ్ళిపోయిండు. అరేయ్ సామీ.. ‘బిచ్చగాడు’ రేంజ్ ఆక్షన్, థ్రిల్ ఆశించి వెళ్తే మాత్రం.. థియేటర్ లో ‘ఏడుకొండలు’ పాత్ర వచ్చేదాకా వెతుక్కోవాల్సిందే!

సాగతీత ప్రథమార్ధం (ఫస్టాఫ్ ల్యాగ్): కథ బానే ఉన్నా.. ఫస్టాఫ్ లో కొన్ని సీన్లు సాగదీసినట్టు, మళ్లీ మళ్లీ అవే సీన్లు వస్తున్నట్టు అనిపిస్తది. డైరెక్టర్ గారు కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదేమో!

లాజిక్ లెస్ సెంటిమెంట్: సెంటిమెంట్ దట్టించడంలో ఓకే కానీ.. కొన్ని చోట్ల పాతకాలపు సీన్లు, నాటకీయత ఎక్కువైపోయి సినిమా కాస్త స్లోగా సాగుతున్న ఫీలింగ్ ఇస్తది.

ఫైనల్ పంచ్:

బాటమ్ లైన్ ఏందంటే గ్యాంగ్.. సినిమా మరీ ‘బిచ్చగాడు’ అంత తోపు కాదు. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, అమ్మ సెంటిమెంట్ ఇష్టపడే వాళ్లకు పక్కాగా నచ్చుతుంది. నార్మల్ ఆడియన్స్‌కి మాత్రం కాస్త ఓపిక కావాలి. విజయ్ ఆంటోనీ మార్క్ మిస్సయిన యావరేజ్ దేవుడు!

రేటింగ్: 2.5/5

చివరి ఆఖరి మాట : ‘బిచ్చగాడు’ అంత తోపు కాదు.. అట్లని అట్టర్ ప్లాపూ కాదు.. పక్కా యావరేజ్ సెంటిమెంట్ డ్రామా!

Related News

అబ్బాయ్ కోసం తప్పుకున్న బాబాయ్.. ‘పెద్ది’ వల్ల ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ వాయిదా!

నాగ్ ‘KING 100’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రంగంలోకి దిగిన కన్నడ రియల్ స్టార్

బాహుబలి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదుగా.. ఫ్రాన్స్‌లో ప్రభాస్ యానిమేషన్ సినిమా సెన్సేషన్!

NTR 31.. ‘డ్రాగన్’ లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్.. ప్రశాంత్ నీల్ ఆ రిస్క్ దాటుతాడా?

కృతి శెట్టితో శంకర్ కొడుకు రొమాన్స్.. ‘లవర్ బాయ్’గా అర్జిత్ గ్రాండ్ ఎంట్రీ!

మణికొండ మొత్తం కొనేసేవాడిని.. ఓవర్ కాన్ఫిడెన్స్ ముంచేసింది.. ‘చిత్రం’ శ్రీను షాకింగ్ కామెంట్స్!

షాకింగ్ సర్ప్రైజ్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘స్పైడర్‌మ్యాన్’ కపుల్!

×