E-Paper
Advertisement

AI+ Smartwatch Pulse 2 Phone: మార్కెట్లోకి క్రేజీ గాడ్జెట్స్.. 6000mAh బ్యాటరీ పవర్‌ఫుల్ ఫోన్, రూ.699కే ఇయర్‌బడ్స్!

AI+ Smartwatch Pulse 2 Phone: మార్కెట్లోకి క్రేజీ గాడ్జెట్స్.. 6000mAh బ్యాటరీ పవర్‌ఫుల్ ఫోన్, రూ.699కే ఇయర్‌బడ్స్!
Advertisement

AI+ Smartwatch Pulse 2 Phone: స్వదేశీ బ్రాండ్ AI+ నుంచి బడ్జెట్ ధరలో ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు లాంచ్ అయ్యాయి. గతేడాది జూలైలో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ, తక్కువ కాలంలోనే దాదాపు పది లక్షల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. తాజాగా NovaPods, NovaWatch సిరీస్‌లను తీసుకొచ్చిన సంస్థ.. త్వరలోనే పవర్‌ఫుల్ బ్యాటరీతో రానున్న పల్స్ 2 స్మార్ట్‌ఫోన్‌ను విడుదలను కూడా అధికారికంగా ప్రకటించింది.

రూ.699కే బడ్స్:

తమ యూజర్ల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఏఐ+ రకరకాల మోడళ్లను పరిచయం చేసింది. వీటిలో Novapods Go ధర కేవలం రూ.699 కాగా, మరిన్ని ఫీచర్లు ఉన్న Pro మోడల్ రూ.1,999కి లభిస్తుంది. విభిన్నమైన డిజైన్‌తో వచ్చిన Novapod Clips ధర రూ.3,999గా ఉంది.

Advertisement

Read Also: బ్రాండెడ్ అని కొనేస్తున్నారా? ఈ తేడాలు తెలియకపోతే మీ డబ్బులన్నీ వృధానే!

వాచ్‌లోనే ఇయర్‌బడ్స్:

ఇకపోతే స్మార్ట్‌వాచ్‌ల విషయానికి వస్తే.. Novawatch Active ధర రూ.2,499 కాగా, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన Kids 4G Watch రూ.2,999కి అందుబాటులో ఉంది. అలాగే వాచ్‌లోనే ఇయర్‌బడ్స్ ఉండే వినూత్నమైన WearBuds ధరను రూ.7,999గా నిర్ణయించారు. ఈ ప్రోడక్టులన్నీ ఫిబ్రవరి 27 నుంచి ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.

పల్స్ 2 ఫోన్ విశేషాలివే:

Advertisement

ఏఐ+ పల్స్ 2 ఫోన్‌ మార్చి 2న విడుదల కానుంది. దీనిలో 6,000mAh భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ చాలా స్లిమ్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. అలాగే దీనిలో 50MP ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌ను అందించారు. దీని తర్వాత నోవా 2 సిరీస్ ఫోన్లను కూడా లాంచ్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఫీచర్ల వివరాలు:

Novapods Proలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 6.0 వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. Novawatch యాక్టివ్ మోడల్ 1.73 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో, హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్లతో రానుంది. ఇక పిల్లల వాచ్‌లో జీపీఎస్, వీడియో కాలింగ్ సౌకర్యం ఉండటం వల్ల భద్రత పరంగా ఇది తల్లిదండ్రులకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Read Also: JBL నుంచి Apple వరకు.. ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌తో మార్కెట్‌లోకి కొత్త బడ్స్!

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×