Telugu Producer : వరుస హిట్స్‌తో కూల్‌గా ఉన్న తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయింది. ఓటీటీ సంస్థను ఓ ప్రముఖ నిర్మాత కోట్లాది రూపాయలతో మోసం చేశాడన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ముంబైలో ఉండే అంత పెద్ద ఓటీటీ సంస్థను బురిడి కొట్టి అన్ని కోట్ల లాగేసిన ప్రొడ్యూసర్ ఎవరూ అనేది ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
అతనో తెలుగు ప్రొడ్యూసర్. మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ కొంత వరకు లాస్ అయినా… ఇటీవల దీపావళీ సందర్భంగా వచ్చిన ఓ సినిమా కొంత మేర రిలీఫ్ ఇచ్చింది. తమ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది అంటూ పోస్టర్లు వేసుకున్నాడు. దీంతో పాటు ఓ వివాదంలో ఇరుక్కుని.. వార్తల్లో నిలిచాడు. తర్వాత సారీ అని చెప్పి ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాడు. ఇది పక్కన పెడితే… ఈ ప్రొడ్యూసర్‌పై సంచలన ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఓ బడా ఓటీటీ సంస్థను కోట్ల రూపాయలతో మోసం చేశాడని ఆ ఆరోపణల సారాంశం. అసలు విషయం ఏంటంటే… ముంబై వేదికగా ఉన్న ఓ ఓటీటీ సంస్థ తాజాగా ఆడిట్ చేసిందంట. అందులో ఆ సంస్థ ఉద్యోగి చేసిన పెద్ద స్కాం వారి కంట పడిందంట. ఈ స్కాంలో మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడట.
ఈ ప్రొడ్యూసర్.. మిడ్ రేంజ్ హీరోలతో చిన్న డైరెక్టర్లతో సినిమాలు చేశాడు. వాటికి ఓటీటీ డీల్ కావాలి. ఈ క్రమంలో ముంబైలో ఉన్న ఈ ఓటీటీ సంస్థకు మన తెలుగు యూనిట్‌కు ఇంఛార్జ్‌గా ఉన్న అతనితో కుమ్ముక్కు అయ్యాడు. తన సినిమాలను కొనుగోలు చేయ్యాలని. అది కూడా అధిక ధరకు కొనుగోలు చేయాలని.. అలా వచ్చిన డబ్బును తాము షేర్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారంట.
సాధారణంగా ఓటీటీ డీల్స్ అన్నీ… హీరో.. డైరెక్టర్.. వాళ్లు చేసిన కంటెంట్ మీద ఆధరపడి ఉంటుంది. కానీ, ఇక్కడ ఈ ప్రొడ్యూసర్… ఆ ఓటీటీ కంపెనీ ఉద్యోగి… వీటిని పరిగణలోకి తీసుకోకుండా.. ఇష్టరీతిన ఓటీటీ క్లోజ్ చేసే వాళ్లంట. దీంతో వచ్చిన డబ్బును వీళ్లే పంచుకునే వాళ్లంట. తర్వాత… ఆ ఉద్యోగు.. ఆ సంస్థలో ఉద్యోగం మానేశాడు. ఈ స్కాం… తోటి ఎంప్లాయిస్ వల్ల యాజమాన్యానికి తెలిసిపోయింది. ఆడిట్ చేశారంట. తమ ఉద్యోగి వల్ల.. ఆ నిర్మాత వల్ల తమ సంస్థలో భారీ స్కాం జరిగిందని గుర్తించారంట. స్కాం చేసిన కోట్లాది సొమ్మును ఇప్పుడు రికవరీ చేసే పనిలో ఉన్నారట. డబ్బు రిటర్న్ ఇవ్వకపోతే… లీగల్ గా వెళ్లడానికి కూడా ఆ సంస్థ రెడీగా ఉందని సమాచారం.
2022 నుంచి 2024 వరకు ఆ సంస్థ ఉద్యోగి – మన తెలుగు ప్రొడ్యూసర్ ఈ స్కాంను చాలా ఎక్కువ చేశారంట. తమ సినిమాలే కాదు… ఇతర సినిమాలకు కూడా అధిక ధరకు ఓటీటీ డీల్ సెట్ చేశారట. అలా వచ్చిన డబ్బుతో… ఆ ఓటీటీ సంస్థ ఉద్యోగి కోకాపేట్‌లో 3 ఎకరాల స్థలం కొన్నాడని సమాచారం. అలాగే లగ్జరీ విల్లాలు కూడా కొన్నారంట.
ఆ బడా ఓటీటీ సంస్థలో కోట్లాది రూపాయల స్కాం చేసిన ఆ ఉద్యోగి.. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఓ బడా హీరోకి చెందిన సంస్థలో చేరినట్టు తెలుస్తుంది.
ఆ ఉద్యోగి మాత్రమే కాదు… మన తెలుగు నిర్మాత కూడా ఈ స్కాం తో వచ్చిన డబ్బుతో 1.5 కోట్లు పెట్టి బీఎండబ్యూ కారు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.
ఈ విషయం బయటిక రావడంతో.. ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ, అటు ఓటీటీ సంస్థలు అల్లకల్లోలం అయిపోయాయి. ఇప్పటికే ఆ బడా ఓటీటీ సంస్థ ఇప్పుడు చర్చల దశలో ఉన్న ఓటీటీ డీల్స్‌ను తాత్కాళికంగా ఆపేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు జరిగిన ఓటీటీ డీల్స్ పై సమగ్రంగా ఆడిట్ చేస్తున్నారంట. మిగితా ఓటీటీ సంస్థలు కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ ప్రొడ్యూసర్‌తో పాటు మరో నిర్మాతపై కూడా ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఉద్యోగితో కలిసి ఈ స్కాంలో ఉన్నది ఈ నిర్మాతే అంటూ ఆయనపై కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాలను వేరే ఓటీటీకి ఇచ్చి.. చిన్న సినిమాలను ఈ ఓటీటీ కి ఆ సంస్థ ఉద్యోగితో కలిసి.. ఎక్కువ డబ్బు వచ్చేలా చేశాడు అని ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.
మరి ఈ ఇద్దరిలో ఎవరు ఈ స్కాంలో ఉన్నారు అనేది ప్రస్తుతం ఇంకా మిస్టరీగానే ఉంది. కానీ, ఈ ఇద్దరు నిర్మాతల పేర్లు అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.