Actor Dharmendra: బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర(Dharmendra) గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్(Breach Candy Hospital) లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఈయన వయసు పైబడటంతో వృద్ధాప్య సమస్యల కారణంగా అనారోగ్యానికి గురయ్యారని ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకుంటున్నారని తెలియగానే అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని తెలుస్తోంది. ప్రస్తుతం ధర్మేంద్ర వెంటిలేటర్(Ventilator) పై చికిత్స అందుకుంటున్నట్టు సమాచారం.
ఇలా ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందనే విషయం తెలుసుకున్న అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై ఆయన సిబ్బంది స్పందించారు. ధర్మేంద్ర ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఆయన ఇప్పుడిప్పుడే అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్నారని ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు.. కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఆయన ఉన్నారని అతని ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని ఆయన బృందం వెల్లడించారు.
కంటికి సర్జరీ..
ఇలా ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నప్పటికీ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న నేపథ్యంలోనే ఈయన ఆరోగ్య విషయంలో అభిమానులు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 89 సంవత్సరాల వయసు ఉన్న ధర్మేంద్ర వయసు పైబడటంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో ఆయనని హాస్పిటల్లో చేర్పించినట్టు సమాచారం. ఇకపోతే ఈయన ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కంటికి సర్జరీ కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే. మరొక నెల రోజులలో ఈయన 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఈయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమితాబ్ మనవడితో ధర్మేంద్ర సినిమా…
ఇక ధర్మేంద్ర సినీ కెరియర్ విషయానికి వస్తే ఈయన 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరేతో అరంగేట్రం చేశారు . షోలే, ధరమ్ వీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్ మరియు డ్రీమ్ గర్ల్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సుమారు 300కు పైగా సినిమాలలో నటించిన ఘనత ధర్మేంద్రకు ఉంది ఈయన నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడుగా నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ వయసులో కూడా ఈయన సినిమాలలో నటించారని చెప్పాలి. ప్రస్తుతం ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా నటించిన ఇక్కిస్ (Ikkis)సినిమాలో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: RT 76: భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ.. టైటిల్ పోస్టర్ రిలీజ్!