BigTV English

Nithiin – Sharwanand : నితిన్ వదిలేసిన కథతో శర్వానంద్, ఇద్దరిదీ ఒకే స్థితి

Nithiin – Sharwanand : నితిన్ వదిలేసిన కథతో శర్వానంద్, ఇద్దరిదీ ఒకే స్థితి
Advertisement

Nithiin – Sharwanand : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నితిన్ ఒకడు. జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ మంచి విజయం అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత చేసిన దిల్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా తర్వాత పదేళ్లపాటు నితిన్ కెరియర్ లో హిట్ సినిమాలు లేకుండా పోయింది.


విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమా మంచి కం బ్యాక్ అయింది. ఆ సినిమా ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అప్పుడే తన ఇష్టాన్నంతా కూడా పవన్ కళ్యాణ్ మీద చూపించాడు నితిన్. అక్కడితో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నితిన్ సినిమాలను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. ఇష్క్ సినిమా తర్వాత వచ్చిన గుండెజారి గల్లంతయింది సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఆల్మోస్ట్ నితిన్ కం బ్యాక్ ఇచ్చేసాడు అనుకున్న తరుణంలో మళ్లీ వరుస డిజాస్టర్లు పడ్డాయి.

నితిన్ వదిలేసిన కథతో శర్వానంద్

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ గా ఒక సినిమాను అనుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆ సినిమా శర్వానంద్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్ ఆ కథను ఒప్పుకున్న తర్వాత వెనకడుగు వేశారట. మరోవైపు నితిన్ లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఫైనల్ సీటింగ్స్ పూర్తి కాలేదు.


ఇద్దరిదీ ఒకే స్థితి 

ఒకవైపు నితిన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరోవైపు శర్వానంద్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలెంట్ విషయంలో కూడా వీరిద్దరిని తక్కువ చేయడానికి లేదు. కానీ వీరిద్దరూ కథలను ఎంచుకునే విధానం వల్లనే వీళ్ళకి హిట్ సినిమాలు కంటే ఎక్కువ ప్లాప్ సినిమాలు పడుతున్నాయి.

శ్రీను వైట్ల పని అయిపోయింది అనుకున్న తరుణంలో విశ్వం సినిమా ఊపిరిపోతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన రేంజ్ లో సక్సెస్ సాధించక పోయినా కూడా ఒక మోస్తరుగా మంచి విజయాన్ని అందుకుంది ఆ సినిమా. దాని తర్వాతే శ్రీను వైట్లకి కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇప్పుడు శర్వానంద్ చేయబోయే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాలి.

శర్వానంద్ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. శ్రీను వైట్ల కామెడీ ఎలా రాస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీరిద్దరి సినిమాలో బ్లాక్ బస్టర్ పెడితే ఇద్దరికీ స్ట్రాంగ్ కం బ్యాక్ అని చెప్పాలి.

Also Read: Maruthi on Bunny Vas: వాడు దొంగ నా కొడుకుల సంఘానికి అధ్యక్షుడు, బన్నీ వాసు కామెంట్స్ పై మారుతి రియాక్షన్

Related News

Hrithik Roshan: ఢిల్లీ హైకోర్టులో హృతిక్ రోషన్ కు భారీ ఊరట… వెంటనే ఆ పని చేయాలంటూ!

‎Ahana Krishna: ఖరీదైన కారు కొన్న నటి… ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

‎Sai Durga Tej: బ్రో తర్వాత నా సినిమాలు ఆగిపోయాయి.. సాయి తేజ్ ఎమోషనల్!

Brahmanandam: ప్రముఖ షోలో గుక్కపెట్టి ఏడ్చిన బ్రహ్మానందం.. అసలేం జరిగిందంటే!

‎Bunny vasu: పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోను… బన్నీ వాసు మాస్ వార్నింగ్

Sonakshi Sinha: తల్లి కాబోతున్న మరో స్టార్‌ హీరోయిన్‌.. ఇదిగో క్లారిటీ!

Deepika -Smriti Irani:దీపికా పని గంటల వివాదంపై స్మృతి ఇరానీ కామెంట్స్..  లాభాలు రావాలంటూ!

Big Stories

×