OG Film: ఒకప్పుడు సినిమా మొదటి నుంచి చివరి వరకు కంప్లీట్ గా సాగేది. ఇప్పుడు మాత్రం అందరూ పార్ట్ వన్ పార్ట్ టూ అంటూ తీయడం మొదలుపెట్టారు. ఎస్.ఎస్ రాజమౌళి ఏ ముహూర్తాన బాహుబలి సినిమాను రెండు పార్ట్స్ గా చేశారు కానీ, అప్పటినుంచి చాలామంది తెలుగు దర్శకులు అదే పనిని చేసే ప్రయత్నంలో పడ్డారు. ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రావాల్సిన పార్ట్-2 సినిమాలు చాలా ఉన్నాయి.
ఈ తరుణంలో సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ జి సినిమాకి కూడా పార్ట్ 2 ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. స్వతహాగా సుజీత్ చాలా తెలివైనవాడు కాబట్టి ఇప్పుడే పార్ట్ 2 కన్ఫర్మ్ చేయలేదు.
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కూడా సినిమాపై మంచి నమ్మకాన్ని క్రియేట్ చేశాయి. సినిమా గురించి ఇప్పుడు లేటెస్ట్ గా ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, సీక్వెల్ కోసం వెయిట్ చేసే ఎండింగ్ ఉండదు. కానీ ఫ్యూచర్ లో సీక్వెల్ తీయడానికి ఛాన్సెస్ ఉంటాయి.
పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో ఈ సినిమా కోసం డేట్స్ ఇస్తారో లేదో క్లారిటీ లేదు. అందుకోసమే ఓజి సినిమా చూస్తున్నప్పుడు ఒక సంపూర్ణమైన సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకవేళ సినిమా మంచి సక్సెస్ అయిపోతే, పవన్ కళ్యాణ్ మళ్లీ డేట్స్ ఇస్తే సీక్వెల్ చేయడానికి అవకాశం ఉంటుంది.
పవన్ కళ్యాణ్ నుంచి చివరగా విడుదలైన సినిమా హరిహర వీరమల్లు. సినిమాను పవన్ కళ్యాణ్ విపరీతంగా ప్రమోట్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా కోసం అధికంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అదే స్థాయిలో ఓ జి సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి ఇంటర్వ్యూలు ఇస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read: Sonu Sood : రియల్ హీరోకి ఈడీ నోటీసులు.. ఆ రోజే విచారణ