Rammohan Reddy: టీఆర్ఎస్ పార్టీ.. 2001వ సంవత్సరంలో పార్టీ స్థాపన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ పార్టీని నడుపుకుంటూ ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్ కే ఎక్కువగా పరిమితం అయ్యారు. అప్పటి నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయి.. అయితే కేసీఆర్ తర్వాత పార్టీలో టక్కున వినిపించే పేరు కేటీఆర్, హరీష్ రావు.. అప్పటి నుంచి వీరిద్దరే పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ఆధిపత్యాన్ని చేపట్టాలని ఓ పెద్ద నేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను బెంగుళూరులోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సెంటర్ కు పంపే వ్యూహం కూడా ఇప్పటికే పార్టీలో షురూ అయ్యిందని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఎవరు ఆ పెద్దనేత..?
ఈడీ ఆఫీస్ వద్ద ఓ సినీ హీరోయిన్ కేటిఆర్ పేరు ప్రస్తావించిన స్టేట్మెంట్ ఆధారంగా కుట్రలు జరుగుతున్నాయని సామ రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ తర్వాత పార్టీలో ఆధిపత్యాన్ని చెలాయించాలని ఓ పెద్ద నేత, ట్రబుల్ షూటర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పార్టీలో కేసీఆర్ కొడుకునే పక్కకు పెట్టే వ్యూహం జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నుండి కవితను బయటకు పంపారని అన్నారు. అన్ని అనుకున్నట్టే వాళ్ల ప్లాన్ విజయవంతంగా ముందుకు వెళ్తొందని సంచలన ఆరోపణలు చేశారు సామ రామ్మోహన్ రెడ్డి.
ALSO READ: CM Revanth Reddy: అంధ విద్యార్ధులకు సర్కార్ చేయూత.. వాయిద్య పరికరాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
త్వరలోనే బయటకు సంచలన విషయాలు..
పార్టీలో కేటీఆర్ పక్కన పెట్టి.. తన చేతుల్లోకి తీసుకోవాలనే వ్యూహాన్ని ఎవరు పన్నుతున్నారో త్వరలో బయట పడుతుందని ఆయన చెప్పారు. ఆ పెద్ద నేత, ట్రబుల్ షూటర్ వెనకాల బీజేపీ నేతలు ఉన్నారని చెప్పారు. బీజేపీ నేతలు, కేంద్ర హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్ లోతుగా అధ్యయనం చేసి చెప్పాలని అన్నారు. గతంలో తాను చాలా అంశాలు చెప్పినట్టు.. చెప్పినవన్నీ కూడా నిజం అయ్యాయని వ్యాఖ్యానించారు.
ALSO READ: Andhra Pradesh: దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15 వేల సహాయం – వాహన మిత్ర పథకం ప్రారంభం
గతంలో నేను చెప్పినవన్నీ నిజాలయ్యాయి…
నారా లోకేష్ కేటీఆర్ రహస్య భేటీ అయ్యారని చెప్పాను.. అది నిజం అయ్యిందని అన్నారు. బిజినెస్ డీల్ కోసం కేటీఆర్, లోకేష్ భేటీ అయ్యారని చెప్పారు. మూతపడ్డ ఫ్యాక్టరీ తిరిగి ఓపెన్ చేయడానికి డీల్ జరిగిందని అన్నారు. ఆ చర్చలు సానుకూలంగా సాగాయని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తెలిపారు.