OTT Movie : కొరియన్ సిరీస్ లు అంటే పడిచచ్చే వారి సంఖ్య ఇండియాలో భారీగా ఉంది. భాషా భేదం లేకుండా కొరియన్ సినిమాలు, సిరీస్ లు, ఫుడ్ అంటే క్రేజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారు చూడాల్సిన మస్ట్ వాచ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ ఎంత బాగుంటుందంటే ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేదాకా ఆపరు. మరి ఈ సిరీస్ ఏ ఓటెటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
‘బోన్ అపెటిట్, యువర్ మాజెస్టీ’ (Bon Appétit, Your Majesty) సౌత్ కొరియన్ రొమాన్స్ ఫ్యాంటసీ వెబ్ సిరీస్. 2025లో విడుదలైన ఈ రొమాంటిక్ – కామెడీ – ఫ్యాంటసీ వెబ్ సిరీస్ కు జాంగ్ టే-యూ దర్శకత్వం వహించగా, tvN నిర్మాణంలో తెరకెక్కింది. పార్క్ కుక్-జే వెబ్ నవల “Surviving as Yeonsan-gun’s Chef” (Yeonsankunui Chefro Salanamki) ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ లో ఇమ్ యూన్-ఆ (యెన్ జీ-యొంగ్, చెఫ్), లీ చె-మిన్ (కింగ్ యీ హ్యూన్, టైరెంట్), కాంగ్ హాన్-నా (సపోర్టింగ్ రోల్), చొయ్ గ్వి-హ్వా (కింగ్ యొక్క మదర్) తదితరులు నటించారు. మొత్తం 12 ఎపిసోడ్‌లుగా (ఒక్కొక్కటి 1 గంట 20 నిమిషాలు) ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో రేటింగ్ 8.2 ఉందంటేనే ఈ సిరీస్ ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు.
సిరీస్ యెన్ జీ-యొంగ్ (ఇమ్ యూన్-ఆ) అనే దక్షిణ కొరియన్ ఫ్రెంచ్ కుసిన్ చెఫ్ తో మొదలవుతుంది. ఆమె తన కెరీర్ పీక్‌లో ఉండగా, ఒక సోలార్ ఎక్లిప్స్ సమయంలో అనుకోకుండా టైమ్ స్లిప్ అవుతుంది. అలా టైం ట్రావెల్ చేసి జోసియన్ డైనాస్టీ (16వ శతాబ్దం)కు వెళ్తుంది. అక్కడ ఆమెను టైరెంట్ కింగ్ యీ హ్యూన్ (లీ చె-మిన్) చూసి, చంపేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే జరిగే అటాక్ లో పొరపాటున ఆమెతో పాటు రాజు కూడా లోయలో పడిపోతాడు. ఆ తరువాత ఇద్దరికీ ఫైట్ జరుగుతుంది. ఆమె ఫ్యూచర్ నుంచి వచ్చినట్టు చెప్తుంది. కానీ రాజు నమ్మడు. అలాగే హీరోయిన్ తాను టైం ట్రావెల్ చేయడానికి కారణం అయిన బుక్కును లోయలో పడిపోయేటప్పుడు పోగొట్టుకుంటుంది. ఇక తనను చంపాలనుకుంటున్న రాజు చేతులు కట్టేసి ఓ మారుమూల ఇంటికి చేరుకుంటుంది హీరోయిన్. అక్కడ ఉన్న ఒంటరి మహిళను ఫ్రెండ్ గా చేసుకుని చెఫ్ గా తన చేతి వాటం చూపిస్తుంది.
ఆమె వంటకు రాజు ఫిదా అయిపోతాడు. ఆ తరువాత రాజు ఆమెను రాజు హెడ్ చెఫ్‌గా అపాయింట్ చేస్తాడు. చెఫ్ జీ-యొంగ్ ప్యాలెస్‌లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ మహిళలపై అట్రాసిటీస్ ను ఎదుర్కొంటుంది. కానీ ఆమె మోడరన్ డిష్‌లు (ఫ్రెంచ్ కుసిన్ విత్ కొరియన్ ట్విస్ట్) కింగ్‌ను ఆకర్షిస్తాయి. అంతేకాదు అతని చైల్డ్‌హుడ్ మెమరీస్ ను ఆ వంటలు గుర్తు చేస్తాయి. జీ-యొంగ్ ప్యాలెస్ పాలిటిక్స్, రాణి కాంగ్ హాన్-నా, కింగ్ మదర్ చొయ్ గ్వి-హ్వా జరిపే కుట్రల నుంచి సర్వైవ్ అవుతూ చెఫ్ గా అక్కడే సెటిల్ అవుతుంది. నెమ్మదిగా రాజు, జీ-యొంగ్ మధ్య రొమాన్స్ మొదలవుతుంది. క్లైమాక్స్‌లో జీ-యొంగ్ ఒక మేజర్ పాలెస్ ఇన్ట్రీగ్ ను ఎక్స్‌పోజ్ చేసి, కింగ్‌ను సేవ్ చేస్తుంది. ఇంతకీ ఆ కుట్ర ఏంటి? హీరోయిన్ మళ్ళీ ఫ్యూచర్ లో అడుగు పెట్టిందా ? లేదా ? అన్నది స్టోరీ.
Read Also : చిన్న క్లూ కూడా వదలకుండా చంపే కిల్లర్… గ్రిప్పింగ్ స్టోరీ ఉన్న సీట్ ఎడ్జ్ కన్నడ క్రైమ్ కథ