Sonu Sood : చాలామంది జీవితాలను రోడ్డు మీదకు లాగేసింది బెట్టింగ్. ఒకప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వకముందు ఈ బెట్టింగ్స్ వలన మన పూర్వీకులు నష్టపోయినట్లు కథలుగా విన్నాం. ఇప్పటికీ కూడా కొన్ని సోషల్ మీడియా రీల్స్ లో ఇదంతా మా తాతదే కానీ కొన్ని రోజులు పేకాడటం వలన ఇది మాది కాకుండా పోయింది అంటూ ఫన్నీ రీల్స్ కనిపిస్తుంటాయి.
ఇప్పుడు మాత్రం బెట్టింగ్స్ అనేవి నాలుగు గోడల మధ్య ఒక్కరే కూర్చొని తెలియని వ్యక్తితో ఆడుకోవచ్చు. అలానే ఈ బెట్టింగ్ కోపం కూడా మనిషి మైండ్ సెట్ అని అర్థం చేసుకొని ఆర్థికంగా పాతాళంలోకి తోసేస్తుంది. దాని నుంచి బయటపడటం అనేది మామూలు విషయం కాదు. చాలామంది ప్రాణాలను కోల్పోయారు.
చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ బెట్టింగ్ వలలో పడి ప్రాణాలు తీసుకోవడం ఆశ్చర్యకరం. అంతేకాకుండా చాలామంది తెలుగు సినిమా సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఇలా ప్రమోట్ చేయడం వలన చాలామంది ఇన్ఫ్లుయన్స్ అయ్యారు m దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఎక్కువ శాతం బెట్టింగ్ యాప్స్ కూడా బ్యాన్ చేశారు.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఈ కేసులో రియల్ హీరోగా పేరొందిన స్టార్ నటుడు సోనూసూద్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. 1xBet బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించి సమన్లు పంపింది. ఈనెల 24న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
మామూలుగా సోను సూద్ కు మంచి పేరు ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే ఆదుకోవడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు. ఆయన చేసిన ఎన్నో పనులు చాలామందిని జీవితాలు నిలబెట్టాయి. అయితే ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ లో సోను సూద్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది కొంత మేరకు మైనస్ అని చెప్పాలి. ఈ ఒక్క విషయంలో ఆయన కేర్ తీసుకుని ఉండుంటే పదిమంది అతను ఆదర్శంగా తీసుకునే వాళ్ళు. ఇకనైనా జాగ్రత్తపడి ముందు ముందు ఇటువంటి వాటికి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండే ప్రయత్నం చేయాలి అనేది అభిమానుల అంతరార్థం.
Also Read: Bigg Boss 9: నామినేషన్స్ డే, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. కొట్టుకోవడమే మిగిలిపోయింది అది కూడా చేసేయండి