BigTV English

Priyanka mohan: డబ్బులిచ్చి మరీ ట్రోల్స్ చేయిస్తున్నారు.. ఊహించని కామెంట్స్ చేసిన ప్రియాంక!

Priyanka mohan: డబ్బులిచ్చి మరీ ట్రోల్స్ చేయిస్తున్నారు.. ఊహించని కామెంట్స్ చేసిన ప్రియాంక!

Priyanka mohan: ప్రముఖ బ్యూటీ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తెలుగు, తమిళ్, కన్నడ భాషలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.. 2019లో తొలిసారి తెలుగులో నాని(Nani) హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత శ్రీకారం సినిమాలో కూడా నటించింది. తమిళంలో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా నటించిన డాక్టర్, డాన్ చిత్రాలతో తెలుగులో సినిమాలు చేయడానికి అంటే ముందే.. తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరో గా నటిస్తున్న ఓజీ (OG) సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.


డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేయిస్తున్నారంటూ ప్రియాంక ఆవేదన..

ఇదిలా ఉండదా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక మోహన్.. తనపై కావాలని డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేయిస్తున్నారు అంటూ మండిపడింది. నటనపై, ముఖకవళికలపై కావాలని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని, అందుకే అవకాశాలు కూడా తగ్గిపోయాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ.. ” కొంతమంది కావాలనే నాపై ట్రోల్స్ చేస్తున్నారు. కావాలని డబ్బులు ఇచ్చి మరీ నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది నా ఇమేజ్ ను డామేజ్ చేయడానికి ఇలా చేస్తున్నారు. అవన్నీ ఎవరు చేయిస్తున్నారో కూడా నాకు తెలుసు” అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. దీంతో ప్రియాంక మోహన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎవరు ఈమెపై ఇంత కక్ష కట్టారు అంటూ పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

అసలు సంగతి ఇదేనా?


అసలు విషయంలోకెళితే.. ప్రస్తుతం తమిళ స్టార్స్ తో వర్క్ చేసే ప్రముఖ ఏజెన్సీ తో ప్రియాంక ఒప్పందం క్యాన్సిల్ చేసుకుందని.. అందుకే ఆ సంస్థ కావాలని ఈమెపై నెగటివ్గా ప్రచారం చేస్తున్నట్లు..పైగా అవకాశాలు లేకుండా చేయిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి దీనిపై ప్రియాంక ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా ఒక నటిపై ఇలా డబ్బులు ఇచ్చి మరీ ట్రోలింగ్ చేయడం నిజంగా పద్ధతిగా లేదు అంటూ అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు.

ఓజీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ప్రియాంక..

ప్రియాంక మోహన్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ లో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ప్రియాంక మోహన్ కూడా ఈ సినిమా సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.మరి ఈ సినిమాల్లో ఆమె తన నటనతో ఏ విధంగా మెప్పించారో తెలియాలి అంటే సెప్టెంబర్ 25 వరకు ఎదురు చూడాల్సిందే.

ALSO READ:Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Related News

Sonu Sood : రియల్ హీరోకి ఈడీ నోటీసులు.. ఆ రోజే విచారణ

Film industry: గుండెపోటుతో చైల్డ్ ఆర్టిస్ట్ మృతి.. ఎవరంటే?

Prabhas: ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షస్ మొదలుపెట్టేసినట్టే..

Arundhati: అరుంధతి రీమేక్.. శ్రీలీలతోనా.. ఏంటి కామెడీనా ?

Disha patani : దిశా పటానీకి అండగా ముఖ్యమంత్రి.. దోషులను ఎక్కడున్నా పట్టుకుంటాం..!

NTR: ఇంత సైలెంట్ గా పని కానిచ్చేస్తే ఫ్యాన్స్ పరిస్థితి ఏంటన్నా

Mirai Movie : ‘మిరాయ్ ‘ మూవీని కాపీ కొట్టారా? ఇదిగో ప్రూఫ్..డైరెక్టర్ బుక్కయ్యాడే..?

Big Stories

×