Khammam: ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. శ్రీనగర్ కాలనీలోని మేడిశెట్టి కృష్ణ అనే వ్యక్తి జుమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు. వైరా రోడ్డులో ఉన్న కొణార్క్ రెస్టారెంట్ నుండి స్పెషల్ చికెన్ బిర్యానీ వచ్చింది. బిర్యాని తింటున్న సమయంలో.. అందులో బొద్దింక కనిపించింది. దీంతో షాకయ్యాడు. వెంటనే రెస్టారెంట్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే రెస్టారెంట్ సిబ్బంది దీనిపై నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాలని, ఆ హోటల్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు తెలిపాడు.