Film industry:ఈమధ్య కాలంలో గుండెపోటుతో చాలామంది మరణిస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.నిత్యం గుండెకు సంబంధించిన జాగ్రత్తలు చెబుతున్నప్పటికీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ మహమ్మారి ప్రాణాలను హరింప చేస్తోంది. ముఖ్యంగా కార్డియాలజిస్టుల సలహాల మేరకు.. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అని డైట్ పాటిస్తూ వ్యాయమాలు చేసే సెలబ్రిటీలు కూడా చనిపోతున్నారు.అలా ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ గుండెపోటు అనే మహమ్మారి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పుట్టిన పిల్లవాడి నుండి మొదలు పండు ముసలి వాళ్ళ వరకు ఎంతో మందిని వేధిస్తున్న సమస్యగా మారిపోయింది.
అయితే తాజాగా పాకిస్తాన్ కి చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ గుండెపోటుతో మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది.మరి ఇంతకీ ఆ నటుడు ఎవరు అనే విషయానికి వస్తే.. పాకిస్తాన్ చైల్డ్ ఆర్టిస్ట్ ఉమర్ షా (Umar Shah) .. పాకిస్తాన్ ప్రముఖ చైల్డ్ టీవీ స్టార్ అయినటువంటి ఉమర్ షా 15 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.. ఉమర్ షా చనిపోయిన విషయాన్ని ఆయన సోదరుడు టిక్ టాక్ స్టార్ అయినటువంటి అహ్మద్ షా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అఫీషియల్ గా బయటపెట్టారు.. పాకిస్తాన్ సినీ ఇండస్ట్రీలో .. టీవీ రంగంలో ఎంతో మంచి పేరు సంపాదించిన ఉమర్ షా మరణం ఇండస్ట్రీని కన్నీళ్లు పెట్టిస్తోంది..
ఉమర్ షా మరణం పై వైద్యులు ఏమన్నారంటే..?
ఉమర్ షా తన స్వస్థలం అయినటువంటి డేరా ఇస్మాయిల్ ఖాన్ లో సోమవారం రోజు గుండెపోటుతో చనిపోయినట్టు అక్కడి స్థానిక మీడియా చెబుతోంది.. అయితే ఉమర్ షా మరణం గురించి డాక్టర్లు ఓ నివేదిక విడుదల చేశారు. అందులో ఉమర్ షా ఎక్కువగా వాంతులు చేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ద్రవం చేరి ప్రాణాపాయ స్థితిలో మరణించినట్లు తెలియజేశారు. ఉమర్ షా మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రెండేళ్ల క్రితం ఉమర్ షా చెల్లెలు కూడా మృతి..
గత రెండు సంవత్సరాల క్రితమే ఉమర్ షా చెల్లెలు కూడా మరణించడం..ఆ తర్వాత రెండేళ్లకే ఉమర్ షా కూడా మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది.రెండు సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు పిల్లల్ని కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణతాతీతం . ఉమర్ షా చెల్లెలు ఆయేషా 2023 నవంబర్లో హఠాత్తుగా చనిపోయిందట.. ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా దుఃఖిస్తున్నారు..
ఉమర్ షా మరణాన్ని ధ్రువీకరించిన సోదరుడు..
ఉమర్ షా చనిపోయిన విషయాన్ని ఆయన సోదరుడు అహ్మద్ షా ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విధంగా తెలియజేశారు. “మా చిన్ని మెరిసే నక్షత్రం మమ్మల్ని విడిచిపెట్టి పోయింది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అహ్మద్ షా పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో చాలామంది ఉమర్ షా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
ఉమర్ షా కెరియర్..
ఉమర్ టీవీ షో లైనటువంటి ‘జీతో పాకిస్తాన్’, ‘షాన్-ఎ-రంజాన్’ వంటి షోల ద్వారా పాపులర్ అయ్యారు.. ఉమర్ షా ఎంతో చక్కగా తన అన్నదమ్ములతో కలిసి పలు షోలలో పాల్గొంటూ తన అమాయకపు మాటలతో ఎంతోమందిని నవ్వించారు.అలాంటి ఉమర్ షా మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఉమర్ షా మరణ వార్త వినగానే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సర్పరాజ్ అహ్మద్ నివాళులర్పించారు. అలాగే పాకిస్తాన్ కి చెందిన ప్రముఖులు ఉమర్ షా మరణం పై సంతాపం ప్రకటిస్తున్నారు.
ALSO READ:Bigg Boss 9: బాడీ షేమింగ్ తో హీటెక్కిన నామినేషన్.. మూల్యం తప్పదా?