NTR : మన హీరోలు సినిమా కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఒక పాత్ర కోసం బరువు పెరుగుతారు. అలానే కొన్ని పాత్రల కోసం విపరీతంగా బరువు తగ్గుతారు. బరువు పెరగటం ఈజీగానే తగ్గటం అనేది మామూలు విషయం కాదు. ఇప్పటికీ కూడా బరువు పెరిగిన తర్వాత తగ్గడానికి ఇబ్బంది పడ్డ నటీనటులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.
ప్రకాష్ కోవెలమూడి (Prakash kovelamudi) దర్శకత్వంలో వచ్చిన సైజు జీరో (size zero) అనే సినిమా కోసం అనుష్క (Anushka Shetty) అమాంతం బరువు పెరిగింది. ఆ తర్వాత స్వీటీ బరువు తగ్గడానికి చాలా టైం పట్టేసింది. ఇప్పటికీ కూడా అనుష్క తనకి ఉన్న కొన్ని హెల్త్ ఇష్యూస్ బయట కనిపించట్లేదు.
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో ఎన్టీఆర్ ఒకరు. తన సినిమా ప్రారంభ దశలో ఎన్టీఆర్ ప్రతి సినిమాలో కూడా చాలా లావుగా కనిపిస్తూ ఉండేవాళ్ళు. రాఖీ (Rakhi) సినిమాలో ఎన్టీఆర్ లుక్కు ఇప్పటికీ వైరల్ అవుతూ ట్రోలింగ్ కు గురి అవుతుంది. అయితే యమదొంగ (yamadonga) సినిమా చేసే టైంలోనే చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నారు తారక్ అని రాజమౌళి అన్నారు.
వెంటనే ఎన్టీఆర్ అమాంతం బరువు తగ్గిపోయారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కొన్ని సినిమాల్లో చాలా అందంగా కనిపించారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం కూడా ఎన్టీఆర్ అమాంతం బరువు తగ్గిపోయాడు.
Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States. pic.twitter.com/ZTFLxOgPNl
— U.S. Consul General Laura Williams (@USCGHyderabad) September 16, 2025
ప్రశాంత్ నీల్ సినిమా గురించి ఆడియన్స్ ఊహించిన అప్డేట్స్ అయితే రావడం లేదు. ఎన్టీఆర్ కూడా బయట పెద్దగా కనిపించడం లేదు. తాజాగా యూఎస్ కన్సోలేట్ కు తారక్ హాజరయ్యారు.
కాన్సులేట్‌కు తారక్ ని స్వాగతించడానికి ఉత్సాహంగా ఉంది! యునైటెడ్ స్టేట్స్‌లో చిత్రీకరించబడిన అతని ఇటీవలి & రాబోయే ప్రాజెక్టులు భాగస్వామ్యం యొక్క శక్తిని, ఉద్యోగాలను సృష్టించడాన్ని మరియు భారతదేశం & యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రదర్శిస్తాయి. అంటూ ట్విట్టర్ వేదిక ఆ పేజ్ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ లో ఎన్టీఆర్ ఫొటోస్ చూసి కొంతమంది అభిమానులు.. మరి ఇలా తగ్గిపోయాడు ఏంటి. అంత తగ్గాల్సిన అవసరం ఏముంది. అలానే బాడీకి ఎవరిదో తల తీసుకొచ్చి యాడ్ చేసినట్లు అనిపిస్తుంది అంటూ ఆ పోస్టులో కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అలానే కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది.
Also Read : Bigg Boss Promo: నరాలు కట్ అయ్యే ప్రోమో, ఈరోజు ఎపిసోడ్ రచ్చ రచ్చే