Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సమయంలో మాట ఇచ్చినట్టే ఏడాదికి రెండు సినిమాలనురిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఒకపక్క సినిమాలను రిలీజ్ కు రెడీ చేస్తూనే ఇంకోపక్క కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ది రాజాసాబ్ సంక్రాంతికి రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. ఇంకోపక్క స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలను పట్టాలెక్కించాడు. స్పిరిట్ ఈ నెల చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఈ రెండు సినిమాలు కాకుండా డార్లింగ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షస్. హనుమాన్ తరువాత ప్రశాంత్ వర్మ.. తేజ సజ్జాతో జాంబీ రెడ్డి 2 ను మొదలుపెట్టడానికి సిద్దమయ్యినట్లు తెలుస్తోంది. ఇక ఈ గ్యాప్ లో ప్రశాంత్ వర్మ.. ప్రభాస్ కోసం బ్రహ్మ రాక్షస్ స్క్రిప్ట్ ను ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది.
మొన్నటివరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కష్టమని, ముందున్న రెండు సినిమాలను ఫినిష్ చేయడానికే సమయం లేకపోవడం.. ఈలోపు ప్రశాంత్ వర్మ ను వెయిట్ చేయించడం ఇష్టం లేక డార్లింగ్.. సినిమాకు నో చెప్పాడని, ఈలోపు ప్రశాంత్ వర్మ.. జాంబీ రెడ్డి 2 ను మొదలుపెట్టే పనిలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ – ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షస్ త్వరలోనే పట్టాలెక్కుతోందని టాక్ నడుస్తోంది.
బ్రహ్మ రాక్షస్ కోసం ప్రశాంత్ వర్మ చాలా కష్టపడ్డాడట. ఈ గ్యాప్ లోనే స్క్రిప్ట్ తో పాటు సినిమా మొత్తానికి విజువలైజేషన్ కూడా ఫినిష్ చేశాడట. ప్రతి సీన్, ప్రతీ షాట్.. పిన్ టూ పిక్ ముందే ప్రీ విజువలైజేషన్ లో డిజైన్ చేసి మరీ ఉంచాడట. దాన్ని చూస్తూ షూటింగ్ చేయవచ్చు. అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడట. అసలు డైరెక్టర్ వర్క్ చూసి మేకర్సే షాక్ అయ్యారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్లనుందని తెలుస్తోంది.
అయితే ప్రశాంత్ వర్మ.. ప్రభాస్ సినిమాను పట్టాలెక్కిస్తే జాంబీ రెడ్డి 2 పరిస్థితి ఏంటి..? మిరాయ్ తరువాత తేజ సజ్జా చేసే సినిమా ఈ సీక్వెల్ అని వార్తలు వచ్చాయి. మరి ఈ కుర్ర డైరెక్టర్.. అటు తేజను.. ఇటు ప్రభాస్ ను హ్యాండిల్ చేయగలడా..? అసలు ప్రభాస్ అయినా ప్రశాంత్ వర్మకు డేట్స్ ఇస్తాడా.. ? అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.