Mohammed Yousuf : ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ లో వేదికగా ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ సామా అనే టీవీ షోలో సూర్యకుమార్ యాదవ్ ని దుర్భాషలాడాడు. ముఖ్యంగా యూసఫ్ ఉద్దేశపూర్వకంగానే సూర్యకుమార్ పేరును వక్రీకరిస్తూ.. అతడినీ పదే పదే పంది అని పిలిచాడు. ఒక యాంకర్ యూసఫ్ కి భారత కెప్టెన్ అని పేరు గుర్తు చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. అయినా అతను పట్టించుకోలేదు. అది చూసి మరో యాంకర్ చిరునవ్వు నవ్వాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఆ తరువాత యూసఫ్.. భారత్ మైదానంలోని అంపైర్లను కోనుగోలు చేసిందని.. మ్యాచ్ రిఫరీని ఉపయోగించి పాకిస్తాన్ ను హింసించిందని ఆరోపించాడు. ఈ కుర్రాళ్లు సినిమా ప్రపంచం నుంచి బయటికీ రాలేకపోతున్నారని యూసఫర్ పేర్కొన్నాడు. సువర్ కుమార్ జో హై.. సువర్ కుమార్ యాదవ్.. గెలవడానికి ప్రయత్నిస్తున్న తీరుకు భారతదేశం సిగ్గుపడాలి.భారత ప్రధాని నరేంద్ర మోడీకి అంపైర్ వేలు ఇచ్చి ఉండవచ్చు. మేము అప్పిల్ చేసినప్పుడు లేపలేదు. కానీ వాళ్లు అప్పిల్ చేసినప్పుడల్లా అంపైర్ వేలు లేపాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు యూసఫ్. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ కి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చిన్నప్పటి కోచ్ అశోక్ అస్వాల్కర్ కౌంటర్ ఇచ్చాడు. ఓ అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ నుంచి ఇలాంటి చెత్త మాటలు అస్సలు ఊహించలేదని పేర్కొన్నాడు. అతని స్థాయి ఇంతకంటే గొప్పగా మాట్లాడాతాడనుకోలేదంటూ చురకలంటించాడు.
“ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉద్దేశపూర్వకంగానే సువార్.. సువార్ అని పిలిచాడు. ఇంత కంటే ఇంకా ఎంతకు దిగజారగలరు..? వాళ్లు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతూనే ఉంటారు. గ్రౌండ్ లో చేయాల్సింది మాత్రం చేయరు. కానీ గ్రౌండ్ బయట పిచ్చి పిచ్చి మాటలతో హైలెట్ అవుతారు. ప్రపంచం మొత్తం వీరిని గౌరవిస్తూనే ఉంది” ప్రతీ ఒక్కరికీ గౌరవ మర్యాదలు ఉంటాయి. ఎవరైనా తమ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. కానీ ఇలాంటి దిగజారుడు వ్యాక్యలు చేయడం సరికాదు. వాస్తవానికి ఆట గురించి ఎలాంటి విమర్శలు చేసినా తప్పు లేదు. కానీ వ్యక్తి గతంతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ తప్పే. ఏదైనా సరే మాట్లాడాలంటే ఆట గురించి మాట్లాడండి. మా జట్టు చాలా అద్భుతంగా ఆడుతోంది. మీ ఆటగాళ్ల పరిస్తితి గురించి ఆలోచించండి. అంతేకానీ ఇతర ఆటగాళ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు” అంటూ అశోక్ అస్కాల్వర్ మహ్మద్ యూసఫ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
A low level rhetoric from Yousuf Yohana (converted) on a national TV program.
He called India captain Suryakumar Yadav as "Suar" (pig).
Shameless behaviour. And they demand respect, preach morality. pic.twitter.com/yhWhnwaYYq
— Slogger (@kirikraja) September 16, 2025