Mirnalini Ravi : టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్ లో వరుసగా పెళ్లి బాట పడుతున్నారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు. అటు హీరోలు కూడా ఒక్కొక్కరుగా నిశ్చితార్థం చేసుకుంటూ పెళ్లికి రెడీ అవుతున్నారు. తాజాగా మరో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్, కోలీవుడ్ బ్యూటీ మృణాళిని రవి పెళ్లి పీటలెక్కింది. తను ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. చడి చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సరే.. ఇంకొందరు మాత్రం ఆమె పెళ్లి చేసుకుంది అని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ప్రస్తుతం ఈమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ మలేషియాలో పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంటో అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికర టాపిక్ గా మారింది. అసలు ఎందుకు ఈమె అక్కడే పెళ్లి చేసుకుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో హీరోయిన్లందరూ కూడా డెస్టిని మ్యారేజ్ లోను చేసుకుంటూ జనాల్లో హైలెట్ అవుతూ వస్తున్నారు. అయితే ఎక్కువమంది హీరో హీరోయిన్లు రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లి చేసుకుంటే తమిళ బ్యూటీ మృణాళిని మాత్రం మలేషియాలో పెళ్లి చేసుకుని అందరికీ ఒక షాక్ ఇచ్చింది. ఇండియాలో కాకుండా మలేషియాలో పెళ్లి చేసుకోవడంపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మలేషియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపమైన లంకావి వేదికగా ఆదివారం వీరి వివాహ వేడుక అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది.. అయితే అందరూ అనుకున్నట్లుగానే ఆమె అక్కడే అతి కొద్ది మంది సన్నిహితులు మధ్య పెళ్లి చేసుకోవాలని అనుకుందట దానివల్లే తన భర్త కూడా అక్కడే ఉండడంతో ఇక మలేషియాలోని పెళ్లి చేసుకుని ఇండియాలో గ్రాండ్ పార్టీ ఇవ్వాలని ఈ ముద్దుగుమ్మ ముందుగానే ప్లాన్ చేసుకుందని ఒక వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పెళ్లి ఎలా జరిగితే ఏమి? ఎక్కడ జరిగితే ఏంటి? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృణాళిని రవి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ క్రేజీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘ఎనిమీ’, ‘కోబ్రా’, ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చీంద్ర’ వంటి చిత్రాలతో టాలీవుడ్, కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. కేవలం తెలుగులో మాత్రమే కాదు అటు తమిళంలోనూ మలయాళం లోను వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారుతుంది. ఈ ముద్దుగుమ్మ అయితే కెరీర్ బిజీగా మారుతున్న టైం లోనే ఈమె పెళ్లి చేసుకోవడం ఆమె ఫ్యాన్స్ కి కాస్త నిరాశను కలిగించింది. మరి పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు సినిమాలు కి గ్యాప్ తీసుకుంటున్నారు. ఇకపోతే ఈమె కూడా సినిమాలకి గుడ్ బై చెబుతుందా లేదా అన్నది చూడాలి..
Also Read :పట్టు చీరలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న బ్యూటీ.. కుర్రాళ్ళు ఫిదా..