Nabha Natesh : ఇటీవల కాలంలో హీరోయిన్లు సినిమాలు కన్నా ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా లక్షల సంపాదిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఒకప్పుడు తమ సినిమా ప్రమోషన్ల కోసం వాడే సోషల్ మీడియాను ఇప్పుడు డబ్బుల కోసం వాడుతున్నారు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో సినిమాలు ఉన్న లేకపోయినా కూడా ప్రతి ఒక్క హీరోయిన్ సోషల్ మీడియాలో తమ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మతిపోగొట్టేలా పోజులు ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్లు అందరూ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఆ లిస్టులోకి ఇస్మార్ట్ పోరి నభా నటేష్.. కూడా చేరిపోయింది.. ఈమధ్య ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తూ వస్తుంది. తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది. మరి ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా నెలకు ఎన్ని లక్షల సంపాదిస్తుంది అన్నది ప్రస్తుతం హాట్ చర్చగా మారింది. ఇక ఆలస్యం ఎందుకు నెలకు ఈ ముద్దుగుమ్మ ఎన్ని లక్షలు సంపాదిస్తుందో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేషా.. టాలీవుడ్ డాష్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అతనికి ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో రామ్ పోతినేనికి జోడిగా ఈ అమ్మడు నటించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమెకు ఫాలోయింగ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల కాలంలో ఈమె చేస్తున్న సినిమాలు కన్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండడంతో పాటు తన లేటెస్ట్ వీడియోలు అలాగే ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం ట్రెండ్ అవుతూ వస్తుంది. కేవలం పాపులారిటిని పెంచుకోవడం మాత్రమే కాదు ఈమెకు సోషల్ మీడియా ద్వారా భారీగానే కాసుల వర్షం కూడా కురుస్తుంది. దాదాపూ నెలకు 10 లక్షల వరకు ఈమె సంపాదిస్తుంది అని ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మరి నిజంగానే సోషల్ మీడియా ద్వారా అన్ని లక్షలు సంపాదిస్తుందా? లేదంటే ఇవి కేవలం పుకార్లు మాత్రమేనా అన్నది తెలియాలి అంటే నభా రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
రామ్ పోతినేని మాస్ ఇమేజ్‌కు ఈ అమ్మడు మ్యాచ్ అయ్యేలా వచ్చినా ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈమె జీవితానికి మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. మొదటి సినిమాతోనే కుర్ర కారు మనసు దోచేసింది. ఆ తర్వాత బిజీగా మారుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ కథలు ఎంపిక విషయంలో కాస్త తడబడడంతో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలయితే ఆమె కథలు పడలేదు. అడపాదదపా సినిమాలతో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కెమిస్ట్రీ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన జోడిగా నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు కుర్ర హీరోలతో కూడా రొమాన్స్ చెయ్యనుంది.. ప్రస్తుతం ఈమె చేతిలో భారీ ప్రాజెక్టులో తెలియవు కానీ రెండు మూడు భారీ ప్రాజెక్టుల కోసం ప్రయత్నాలు చేస్తుంది అని తెలుస్తుంది. మరి ఈ ఏడాది అయినా కూడా ఈమె కథలో బిగ్గెస్ట్ హిట్ పడుతుందా? లేదా అన్నది చూడాలి..