Anirudh Ravichander: సౌత్ సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకులుగా ఎంతో మంది మంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సంగీత దర్శకుడిగా అతి చిన్న వయసులోనే మంచి సక్సెస్ అందుకున్న వారిలో అనిరుద్ రవిచంద్రన్(Anirudh Ravichander) ఒకరు. చిన్నప్పటినుంచ సంగీతంపై ఎంతో ఆసక్తి ఉన్న అనిరుద్ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈయన మొదటి సినిమాలతోనే మంచి సక్సెస్ కావడంతో కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే అనిరుద్ ఇండస్ట్రీ లోకి వచ్చి అప్పుడే 15 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తన 15 సంవత్సరాల సంగీత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా అనిరుద్ స్పందిస్తూ..15 సంవత్సరాల క్రితం ఇదే రోజున తొలి పాట ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. అప్పటినుంచి ఈ ప్రయాణం ఎక్కడ ఆగకుండా నిరంతరంగా కొనసాగుతూనే ఉంది . 15 ఏళ్ల ఈ సంగీత ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు ఒక భాష నుంచి మరో భాషకు, ఒక హృదయం నుంచి కోట్లాది మంది హృదయాలకు మా సంగీతం చేరుకుంది.
ఈ ప్రయాణంలో అంతర్జాతీయ స్థాయి కళాకారులతో కలిసి పనిచేయడం, ఏ భాషలోనైనా పాటలు పాడమని అడిగిన వారికి పాడటం, దేశం చూసిన అతిపెద్ద బ్లాక్‌బస్టర్ సినిమాల్లో భాగం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు అనిరుద్ తెలిపారు.ఈ ప్రయాణంలో దేశంలోని ఎంతోమంది గొప్ప దర్శకులు, నటీనటులు, నిర్మాతలతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. మ్యూజిక్ స్ట్రీమింగ్ రికార్డుల నుంచి ప్రపంచవ్యాప్తంగా నిండిన స్టేడియాల్లో ప్రదర్శనల వరకు, వేలాది పాటలు ప్రేక్షకుల మనసుకు హత్తుకున్నాయి.
ఈ ప్రయాణంలో ప్రతి పాట, ప్రతి కలయిక, ప్రతి రికార్డు, ప్రతి వేదిక, ప్రతి మధురమైన జ్ఞాపకం మాకు ఒక ఆశీర్వాదం. ఇక 2026లో LIK, జననాయగన్, DC, ప్యారడైజ్, జైలర్ 2 వంటి సినిమాలతో మాకు ఈ ఏడాది ఒక అద్భుతమైన సంవత్సరంగా నిలిచిపోయిందని అనిరుద్ తెలిపారు. ఈ 15 సంవత్సరాల ప్రయాణాన్ని ఇంతకంటే గొప్పగా ఎలా జరుపుకోగలను అంటూ తన సినీ ప్రయాణం గురించి సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ ప్రయాణంలో మా కృషి ఎంత ఉందో మీది కూడా అంతే ఉందని తెలిపారు.ఈ 15 ఏళ్లలో లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఇంకా నెరవేర్చుకోవాల్సినది చాలా ఉందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ స్టూడియోలోకి అడుగుపెట్టి, మరిన్ని అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాం. అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయంటూ ఈయన పోస్ట్ చేశారు.
Also Read: జరిగిందే చెప్పాను.. ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు.. వైజాగ్ ఘటన పై నటి ఆవేదన!