Sai Pallavi: సినీ నటి సాయి పల్లవి ఎంతో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస సక్సెస్ సినిమాలను అందుకుంటున్నారు. ఇటీవల ఈ రామాయణ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక త్వరలోనే సాయి పల్లవి నటించిన ఓం చాప్టర్1(OM Chapter 1) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 20వ విడుదల కాబోతోంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి సాయి పల్లవి(Sai Pallavi) ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. నటనపరంగా ఎలాంటి పాత్రలనైనా ఛాలెంజ్ గా తీసుకొని సాయి పల్లవి పరకాయి ప్రవేశం చేస్తుంటారు. ఇక ఓం చాప్టర్ 1 సినిమాలో ఈమె ఐపీఎస్ నిత్యా రెడ్డి (IPS Nitya Reddy)అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పాత్రకు అనుగుణంగా సాయి పల్లవి తన లుక్స్ కూడా పూర్తిగా మార్చేసుకున్నారు.
ఈ సినిమాలో ఐపీఎస్ పాత్రలో నటించడం కోసం సాయి పల్లవి డిఫరెంట్ హెయిర్ స్టైల్లో కనిపించారు. ఈ పాత్ర కోసం ఈమె విగ్ వాడారని అందరూ భావించారు కానీ తాజాగా ఈ విషయం గురించి సాయి పల్లవి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. తాను ఈ సినిమాలో విగ్ వాడానని చాలామంది అనుకుంటున్నారు కానీ ఈ పాత్రలో సహజత్వం కనపడాలనే ఉద్దేశంతో తాను నిజంగానే జుట్టు కత్తిరించుకున్నానని సాయి పల్లవి తెలిపారు. నిజానికి నాకు జుట్టు కత్తిరించుకోవటం ఇష్టం ఉండదు కానీ పాత్ర డిమాండ్ చేసినప్పుడు తప్ప లేదని తెలిపారు. తాను జుట్టు కట్ చేసిన తర్వాత వీడియో కాల్ చేసి అమ్మకు నా జుట్టు చూపించగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి తనతో ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసిందని తెలిపారు.
ఆ తర్వాత నాన్న ఫోన్ చేసి ఇది విగ్గు కదా అని అడిగారని, నాన్నకు అర్థమయ్యేలా చెప్పడంతో అమ్మకు కూడా నాన్న అర్థమయ్యేలా వివరించారని సాయి పల్లవి తెలిపారు. ఇక తాను ఐపీఎస్ నిత్యా రెడ్డి పాత్రను ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ మెరిన్ జోసెఫ్ (IPS Merin Joseph)ను స్ఫూర్తిగా తీసుకున్నానని అందుకే తన జుట్టును కత్తిరించుకున్నానని సాయి పల్లవి తెలిపారు. సాధారణంగా హీరోయిన్స్ ఎవరు కూడా జుట్టు కత్తిరించడానికి ఇష్టపడరు, కానీ సాయి పల్లవి మాత్రం తను నటిస్తున్న పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయటం కోసం జుట్టును కత్తిరించారనే విషయం తెలిసిన అభిమానులు సినిమాల పట్ల ఆమె చూపిస్తున్న డెడికేషన్ కు ఫిదా అవుతున్నారు. ఊరికే అందరూ స్టార్స్ అయిపోరు కదా అంటూ ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదేనా? వైరల్ అవుతున్న క్రేజీ టైటిల్?