Renu Desai: రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. నటిస్తున్న ఈమె త్వరలోనే ధనుష్(Danush) హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓం చాప్టర్ 1 (Om Chapter 1)సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నవంబర్ 21 తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నేడు తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి రేణు దేశాయ్(Renu Desai) కూడా తన కుమార్తె ఆధ్యతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేణు దేశాయ్ వేదికపై మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇలా వేదికపై రేణు దేశాయ్ మాట్లాడుతూ అందరి ముందు నటుడు ధనుష్ కు క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ ధనుష్ సర్ నాకు తమిళం సరిగా మాట్లాడటం రాదు.. షూటింగ్ సమయంలో నా తమిళ తప్పులను చాలా ఓపికగా భరించినందుకు మీకు ధన్యవాదాలు అదేవిధంగా కొన్నిసార్లు ఈమె ఎందుకు తమిళం సరిగా మాట్లాడలేక పోతుందని అనిపించి ఉండవచ్చు. అందుకు నన్ను క్షమించండి అంటూ క్షమాపణలు చెప్పారు. ఇలా తమిళం సరిగా మాట్లాడలేక ఇబ్బంది పెట్టడంతోనే ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక రేణు దేశాయ్ ఓం సినిమా గురించి మాట్లాడుతూ..
ఈ ఏడాది శివరాత్రి రోజు నాకు ఈ సినిమా టీం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. అయితే ఆరోజు నేను కామాఖ్య ఆలయంలో ఉన్నానని, శివరాత్రి, కామాఖ్య ఆలయం, ఓం సినిమా ఈ మూడు చాలా పవర్ఫుల్ కాంబినేషన్ అని కచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని తెలిపారు. ఇక మమ్ముట్టిగా గురించి మాట్లాడుతూ.. నాకు నటించడం రాదు అలాంటిది మమ్ముట్టి గారు ముందు నిలబడి డైలాగులు చెప్పడం అంటే చాలా భయం వేసిందని, 20వ తేదీ మీరందరూ థియేటర్ కి వచ్చి నేను ఎలా నటించాననే విషయాన్ని మీరే చెప్పాలి అంటూ రేణు దేశాయ్ తెలిపారు.
ఇక ఈ సినిమా కోసం డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి కాల్ చేసి నాకు విషయం చెప్పారు నాకు ఎలాంటి లుక్ టెస్ట్ చేయలేదు, నా పాత్ర ఏంటి అనే విషయాన్ని కూడా చెప్పలేదని ఫోన్ చేయగానే నేను వెళ్లి షూటింగ్లో జాయిన్ అయ్యానని రేణు దేశాయ్ తెలిపారు. అయితే ఈమె ఈ సినిమాలో సీనియర్ నటుడు మమ్ముట్టికి భార్యగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ వీడియోలో రేణు దేశాయ్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా చూపించారు. ఈ సినిమాలో రేణు దేశాయ్ పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించిన శ్రీ లీల హీరోయిన్ పాత్రలో నటించారు. ఇక సాయి పల్లవి ఐపీఎస్ నిత్యా రెడ్డి అనే పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
Also Read: రికార్డు సృష్టించిన ‘రాను బొంబాయికి రాను’ సాంగ్.. అల్లు అర్జున్ పాటను బీట్ చేసిందిగా?