Jr.NTR -Anil Ravipudi: టాలీవుడ్ హిట్ మిషన్ గా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ అనిల్ రావిపూడి తన సినిమాలను విడుదల చేస్తూ అద్భుతమైన విజయాన్ని అందుకుంటున్నారు. మన శంకర వరప్రసాద్ సినిమాతో హిట్ కొట్టిన అనిల్ వచ్చేయడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12 విడుదల(January 12 Vidudala) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తదుపరి సినిమాల గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇప్పటికే దిల్ రాజు అనిల్ రావిపూడితో సినిమా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్(Jr .NTR) తో అనిల్ రావిపూడి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇలా ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా ఎవరు ఊహించని కాంబినేషన్ అని చెప్పాలి. ఇలా వీరి కాంబోలో సినిమా ప్రకటించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమాపై భారీగా అంచనాలను కూడా పెంచేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా గురించి అధికారకంగా ఎన్టీఆర్ పోస్ట్ చేస్తూ నవ్వుల విందు సిద్ధమవుతుందని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా పూర్తి ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం ఎలాంటి విషయాలను అధికారకంగా ప్రకటించకపోయినా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం ఎన్టీఆర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు “దానవీరశూర ” (dhana veera soora )అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమాకు సంబంధించిన ఈ టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి నిజంగానే ఈ కాంబోలో రాబోతున్న సినిమాకు దానవీరశూర టైటిల్ ఫిక్స్ అయినట్లేనా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకున్నాయి. రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి అపజయమెరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలాంటి ఒక సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించడం పట్ల అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత గాడ్ ఆఫ్ వార్ పనులలో బిజీ కాబోతున్నారు. ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాతనే అనిల్ రావిపూడి తో ఎన్టీఆర్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇలా వీరి కాంబో వెండి తెరపైకి రావాలి అంటే కొంచెం సమయం పడుతుందని చెప్పాలి.
Also Read: ఇది ఆరంభం మాత్రమే..ఇంకా చాల ఉంది.. 15 ఏళ్ల కెరీర్ పై అనిరుద్ పోస్ట్!