E-Paper
Advertisement

Big Tv Kissik Talks: పేరుకే స్టార్ కిడ్…సొంత ఇల్లు కూడా లేదు.. వరలక్ష్మి ఎమోషనల్ కామెంట్స్!

Big Tv Kissik Talks: పేరుకే స్టార్ కిడ్…సొంత ఇల్లు కూడా లేదు.. వరలక్ష్మి ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్  కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకొని ప్రతి వారం ఒక సెలబ్రిటీని ఆహ్వానించి వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పాల్గొన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం సినిమాలపరంగా ఎంతో బిజీగా ఉన్నారు త్వరలోనే సరస్వతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అద్దె ఇంట్లోనే వరలక్ష్మి శరత్ కుమార్..

తాజాగా కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ తన సినిమాల గురించి రాజకీయాల గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ కూతురు అనే విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ స్టార్ సెలబ్రిటీస్.. ఆస్తులు ఎంత మొత్తంలో ఉన్నాయనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు వరలక్ష్మి సమాధానం చెబుతూ ఇప్పటివరకు నాకు సొంత ఇల్లు కూడా లేదంటూ షాక్ ఇచ్చారు. తాను రెంట్ ఇంట్లోనే ఉంటున్నానని, నాకంటూ పెద్దగా ఆస్తులు ఏమీ లేవని తెలిపారు. నేను సినిమాలోకి వచ్చిన తర్వాత నా డబ్బులతో ఒక కారు కొనుక్కున్నాను. ఈ మధ్యనే ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నానని ఇవి తప్ప నాకు ఏమీ ఆస్తులు లేవు అంటూ ఈ సందర్భంగా వరలక్ష్మి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉండటానికి సొంత ఇల్లు లేదు..

Advertisement

తన తండ్రి శరత్ కుమార్ సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, తన పిన్ని రాధిక శరత్ కుమార్ కూడా స్టార్ హీరోయిన్. తన ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇండస్ట్రీలో మంచి నటీనటులే అయినప్పటికీ వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం తనకంటూ ఉండటానికి సొంత ఇల్లు లేదంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సగం చెన్నై మొత్తం మీదే అని విన్నాను అంటూ వర్ష మళ్ళీ ప్రశ్నించడంతో సగం చెన్నై మొత్తం నాదే అయితే నేనెందుకు ఇక్కడ ఉంటాను, ఎక్కడో ఉండేదాన్ని కదా అంటూ వరలక్ష్మి తెలిపారు.

పెళ్లికి రూ.800 కోట్లు

Advertisement

ఈ ప్రోమో వీడియోలో భాగంగా తన భర్త నికోలై సచ్ దేవ్ గురించి కూడా పలు విషయాలు తెలిపారు .తనది లవ్ మ్యారేజ్ అంటూ ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలియజేశారు. పెళ్లికి 800 కోట్లు ఖర్చు చేశానని వార్తలు వచ్చాయి ఆ వార్తలు చూసి నవ్వుకున్నామని తెలిపారు. ఇక సరస్వతి సినిమాకు 100 కోట్లు కలెక్షన్ లు వస్తే సినిమా కోసం పని చేసిన వారందరికీ బోనస్ ఇస్తానని ఇప్పటికే అందరికీ గోల్డ్ కాయిన్స్ పంచానని వరలక్ష్మి తెలిపారు..

పొలిటికల్ ఎంట్రీ కచ్చితంగా ఉంటుంది..

ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అమ్మాయిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారి గురించి ప్రశ్నలు ఎదురవడంతో అలాంటి వారికి చావు శిక్ష కాదని ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో వారికి వారి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడమే సరైన శిక్ష అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడుతూ తాను తప్పకుండా రాజకీయాలలోకి వస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఎప్పుడు ఏ పార్టీ అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

Also Read: Annagarau vostaru OTT: ఇట్స్ అఫీషియల్ .. ఓటీటీలోకి కార్తీ ‘అన్నగారు వొస్తారు’!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×