Podarillu Madhav : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా తమ నటనకు 100 శాతం న్యాయం చేసేలా చేస్తున్నారు. ఇందులో నటిస్తున్న నారాయణ పెద్దకొడుకు మాధవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సీరియల్ కి మెయిన్ అట్రాక్షన్ మాధవ్ అని అందరికీ తెలిసిందే. మాధవ్ గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మాధవ్ తెగ కష్టపడి పోతున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ మాధవ్ షేర్ చేసిన వీడియోలో ఏముందో ఒకసారి మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
యాక్టర్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జిమ్ లోనే కడుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువమంది తమ ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తూ.. కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో చాలామంది యాక్టర్లు నాజుగ్గా తయారయ్యి వరుస అవకాశాలతో బిజీగా మారాలి అని అనుకుంటున్నారు.. అయితే ఒకప్పుడు అమ్మాయిలు మాత్రమే ఫిట్నెస్ కోసం జిమ్ముల వెంట తెగ పరుగులు తీసేవారు కానీ ఈమధ్య అబ్బాయిలు కూడా ఫిట్గా కనిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సినీ స్టార్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా సీరియల్ యాక్టర్స్ కూడా జిమ్ములలో కసరత్తులు చేస్తూ వస్తున్నారు. తాజాగా పొదరిల్లు సీరియల్ హీరో మాధవ్ జిమ్ లో తెగ కష్టపడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోని అతని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అది చూసిన పొదరిల్లు సీరియల్ అభిమానులు పెద్దోడు తెగ కష్టపడి పోతున్నాడు అంటూ కామెంట్లతో మరింత ట్రెండ్ ఎలా చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో మాధవ్ ఎలా కష్టపడుతున్నారో మీరు ఒకసారి ఇక్కడ చూసేయండి..
స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్ పోదరిల్లులో పాజిటివ్ క్యారెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చేది మాధవ్. హీరోకి అన్న పాత్రలో నటించిన మాధవ్ అసలు పేరు అజయ్ సత్యనారాయణ. ఈయన గతంలో అనేక తెలుగు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు. ఈ మధ్యకాలంలో ఈ హీరో పొదరిల్లు సీరియల్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. గతంలో ఈయన నటించిన సీరియల్స్ ఈ సీరియల్ ముందు తేలిపోయాయి అని చెప్పాలి. పొదిరిల్లు సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన మాధవ్ తన నటనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ హీరో తెలుగులో మంచి పాపులాటిని సొంతం చేసుకున్నాడు. ఒకవైపు వరుసగా సీరియల్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంటాడు. ప్రస్తుతం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తుంది. ఇకపోతే సీరియల్స్లలో నటించినందుకు గాను ఈ హీరో ఒక్క రోజుకి దాదాపూగా 40 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హీరో దాదాపు నెలకు లక్షల్లోనే సంపాదిస్తున్నాడు అని అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇక్కడ మంచి పాపులాటిరిని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు.
?stkn=MTdlYW04bWhsYzlidg==