Paradise: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో చాలా ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు నాని. జెర్సీ సినిమా తర్వాత నాని ఎంచుకున్న సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అవుతున్నాయి. ముఖ్యంగా మంచి సినిమాలు చేయడమే కాకుండా మంచి సినిమాలను నిర్మించడం కూడా మొదలుపెట్టాడు నాని.
నాని కెరియర్ లో దసరా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ తో పనిచేసి, నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా కొట్టాడు. ముఖ్యంగా ఆ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన విధానం చాలామందికి విపరీతంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. మొదటి సినిమాతో ఇంత ప్రభంజనం ఎలా సృష్టించగలిగాడు అని అందరూ శ్రీకాంత్ గురించి మాట్లాడుకున్నారు.
నాని ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా
నాని ప్రస్తుతం శ్రీకాంత్ వదల దర్శకత్వంలో పారడైజ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా దసరా సినిమాను మించి ఉంటుంది అని పలు సందర్భాల్లో నాని తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మార్చి 26 2026 ను ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. తరుణంలో సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారు. మామూలుగా ఫస్ట్ లుక్ పోస్టర్ అంటే కేవలం ఒకటి మాత్రమే వస్తుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి మొత్తం రెండు లుక్స్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. మొదట శ్రీకాంత్ తనని ఎలా కావాలనుకున్నాడో ఆ పోస్టర్ ఉదయం విడుదలవుతుంది. అలానే నాని ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాడు అనేది. అలానే ప్రామిస్ కూడా ఉండేటట్లు సాయంత్రం పోస్టర్ విడుదలవుతుంది. మొత్తానికి రెండు పోస్టర్లతో నాని ఫాన్స్ కి డబుల్ ధమాకా.
TOMORROW | Two Posters.
10:05 AM – how I imagined. How he transformed.
5:05 PM – His attitude and our promise.
With your love and with our madness.
We are going all in with #THEPARADISENote: From now on, every character will be introduced through two posters.
— Srikanth Odela (@odela_srikanth) August 7, 2025
పర్ఫెక్ట్ ప్లానింగ్
కేవలం నాని విషయంలో మాత్రమే కాకుండా ఈ సినిమాలో పనిచేసే ప్రతి క్యారెక్టర్ కి కూడా రెండు ఫొటోస్ ను విడుదల చేసి అప్డేట్ చేయనున్నట్లు దర్శకుడు శ్రీకాంత్ తెలిపాడు. అయితే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సినిమా అనౌన్స్మెంట్ టీజరే చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా ఆ టీజర్ లో ఉన్న కొన్ని పదాలు అభ్యంతర కరంగా ఉన్నా కూడా, ఏదో ఒక బలమైన కథను మాత్రం ప్రేక్షకులకు అందించబోతున్నాడు అని అర్థమయిపోయింది. ఇక రేపు విడుదలవుతున్న పోస్టర్స్ తో మరికొంత క్లారిటీ రానుంది.
Also Read: Actor Prithivi : సినిమాలు వదిలేద్దాం అనుకునే టైంలో సందీప్ రెడ్డి నిలబెట్టాడు