BigTV English

Actor Prithivi : సినిమాలు వదిలేద్దాం అనుకునే టైంలో సందీప్ రెడ్డి నిలబెట్టాడు

Actor Prithivi : సినిమాలు వదిలేద్దాం అనుకునే టైంలో సందీప్ రెడ్డి నిలబెట్టాడు

Actor Prithivi : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది విలక్షణమైన నటులు ఉన్నారు. అయితే ప్రతి ఒక్క నటుడికి కొంత టైం అనేది నడుస్తుంది. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు రావడం తగ్గిపోతుంది. ఒక టైం లో విపరీతమైన అవకాశాలు వస్తాయి. వరుసగా అవకాశాలు వస్తున్న తరుణంలో కూడా కొంతమంది యాక్టింగ్ ప్రేక్షకులకు బోర్ కొడుతుంది.


ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్న ఎంతోమంది నటులు ఇప్పుడు కనుమరుగు అయిపోయారు. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన వాళ్లు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. హీరోగా పని చేసిన వాళ్ళు కొన్ని పాత్రలకు పరిమితం అయిపోయారు. అయితే జగపతిబాబు లాంటి వాళ్ళు హీరోగా చేసిన తర్వాత విలన్ రోల్స్ చేస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుని ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలబడ్డారు.

సినిమాలు వదిలేద్దాం అనుకున్నా 


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో పృథ్వి ఒకడు. పృద్వి ఎన్ని సినిమాలు చేసినా కూడా దేవుళ్ళు సినిమాలో తను చేసిన పర్ఫామెన్స్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా మాత్రమే కాకుండా పలు సినిమాల్లో అద్భుతమైన పాత్రలలో కనిపించాడు పృథ్వి. కొన్ని సినిమాలు హీరోగా కూడా చేసిన తర్వాత, ప్రస్తుత కాలంలో వరుసగా పృథ్వికి కేవలం తండ్రి పాత్రలు మాత్రమే వస్తున్నాయట. మొత్తానికి ఇండస్ట్రీ మీద బోర్ కొట్టి సినిమాలు వదిలేద్దామని ఫిక్స్ అయ్యాడట. ఆ తరుణంలో సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాలోని ఒక పాత్రను ఇచ్చాడు. అనిమల్ సినిమాలో పృథ్వి ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఆ సినిమా మంచి ఫేమ్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ వరుసగా పృథ్వి కి అవకాశాలు మొదలయ్యాయట.

బాబి డియోల్ కి మరో జన్మ 

సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాలో బాబి డియోల్ ని ఒక పాత్రకు కాస్ట్ చేశారు. అయితే బాబి డియోల్ దాదాపు సినిమాలు వదిలేసి ఇంట్లో చాలా రోజులు పాటు ఖాళీగా కూర్చున్నారట. ఒక తరుణంలో పిల్లలు కూడా నాన్న ఏం చేస్తున్నారు అని అడిగి పరిస్థితి వచ్చిందట. ఆ తరుణంలో సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా ఇవ్వడం అనేది తనకు మరో జన్మ అంటూ పలు సందర్భాలలో బాబి డియోల్ కూడా తెలిపాడు. అలానే సందీప్ రెడ్డి వంగ పేరు తీయగానే బాబి డియోల్ విపరీతమైన ఎమోషనల్ అయిపోతారట. ఈ విషయాన్ని డాకు మహారాజు ఇంటర్వ్యూలో దర్శకుడు బాబి తెలిపారు. ఏదేమైనా ఒక సరైన అవకాశం మరిన్ని అవకాశాలను తీసుకువస్తుంది అనడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఉదాహరణలు ఉన్నాయి.

Also Read: C Kalyan: మా నిర్మాతల మీద దాడి చేస్తే తాటతీస్తాం – సి కళ్యాణ్

Related News

Lokesh Kanagaraj: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు

Lokesh Kanagaraj: నేను కూలీ సినిమా కథను మొదట ఆ దర్శకుడు కి చెప్పాను

Kapil Sharma -Kap’s Cafe: కపిల్ శర్మ కేఫ్ పై మరోసారి ఉగ్రదాడి… ఈసారి ముంబైలో అంటూ హెచ్చరిక!

Paradise: నాని ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా, శ్రీకాంత్ అదిరిపోయే ప్లానింగ్

Rajinikanth: రజినీ కాంత్ 50 ఏళ్ల సినీ కెరియర్ పూర్తి.. 5,500 ఫోటోలతో అభిమాని వింత పని!

Big Stories

×