Vishwak sen: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం కోసం పేర్లలో పెద్ద ఎత్తున మార్పులు చేసుకుంటూ ఉన్నారు. ఇలా చాలామంది హీరో, హీరోయిన్లు పేర్లు మార్చుకొని ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా పేర్లు మార్చుకున్న వారిలో నటుడు విశ్వక్ సేన్(Vishwak Sen) ఒకరు. ఈయన ఇండస్ట్రీలో వచ్చే సమయంలో అతని పేరు దినేష్ నాయుడు(Dinesh Naidu) అని ఉండేది. అయితే దినేష్ నాయుడుగా ఓ సినిమా అవకాశాన్ని అందుకొని ఆ సినిమాని పూర్తి చేశారు. అయితే ఆ సినిమా విడుదలకు ఎన్నో ఆటంకాలు వస్తున్న నేపథ్యంలో తన కుటుంబ సభ్యులు న్యూమరాలజీ ప్రకారం తన పేరును విశ్వక్ సేన్ గా మార్చారు.
దినేష్ నాయుడు నుంచి విశ్వక్ నాయుడు..
ఇలా పేరు మార్చుకున్న రెండు వారాలకి ఈయన నటించిన “వెళ్ళిపోమాకే” సినిమా విడుదల కావడంతో ఇక ఈయన విశ్వక్ పేరుతోనే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగారు. ఇలా విశ్వక్ సేన్ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా, వరుస వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి విశ్వక్ తన పేరును మార్చుకున్నారని తెలుస్తుంది. న్యూమరాలజీ ప్రకారమే ఇప్పుడు కూడా ఈయన పేరు మార్చుకున్నట్టు తెలుస్తుంది.
విశ్వక్ నాయుడుగా పేరు మార్పు…
విశ్వక్ సేన్ అనే పేరు నుంచి సేన్ అనే పదాన్ని తొలగిస్తూ నాయుడు అనే పదాన్ని చేర్చినట్టు తెలుస్తుంది . ప్రస్తుతం ఈయన వికీపీడియాను కనుక గమనిస్తే విశ్వక్ నాయుడు(Vishwak Naidu)గా తన పేరు ఉంటుంది. ఇలా న్యూమరాలజీ ప్రకారమే ఈయన విశ్వక్ సేన్ నుంచి విశ్వక్ నాయుడుగా మారారని స్పష్టమవుతుంది. మరి పేరు మార్చుకున్న తర్వాత అయిన విశ్వక్ తన తదుపరి సినిమాలతో సక్సెస్ అందుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈయన చివరిగా లైలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్ద ఎత్తున నెగెటివిటీని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ నగరానికి ఏమైంది 2…
ఈ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా నటుడు పృథ్వీరాజ్ పరోక్షంగా ఓ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారని ఆ పార్టీ అభిమానులు లైలా సినిమాని బాయ్ కాట్ చేశారు. దీంతో ఈ సినిమాకు కావలసినంత నెగెటివిటీ ఏర్పడి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో విశ్వక్ అమ్మాయి పాత్రలో కనిపించి సందడి చేశారు.విశ్వక్‌సేన్ ప్రస్తుతం ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌తో ‘ఫంకీ’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కామెడీ, కుటుంబ కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఈ నగరానికి ఏమైంది 2 సినిమాని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Actor Nani: ముసుగు వేసుకుని మరీ థియేటర్ లో ఆ సినిమాలు చూసిన నాని.. వీడియో వైరల్!