E-Paper
Advertisement

రేట్ల వెనక “9” మాయాజాలం.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన షాపింగ్ సీక్రెట్

రేట్ల వెనక “9” మాయాజాలం.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన షాపింగ్ సీక్రెట్
Advertisement

Why prices end in 99 or 9: మనం ఏదైనా మాల్‌కో, సూపర్ మార్కెట్‌కో వెళ్ళినప్పుడు లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని గమనించే ఉంటాం. అక్కడ ఏ వస్తువు చూసినా దాని ధర రూ.99, రూ.199,రూ. 499 లేదా రూ.999 ఇలా ‘9’ సిరీస్‌తోనే ముగుస్తుంది. అస్సలు రూ. 100 లేదా రూ.500 అని ఎందుకు వేయరు? ఎందుకంటే.. కేవలం ఆ ఒక్క రూపాయి తగ్గించడం వెనక పెద్ద మాయాజాలమే దాగుంది. కంపెనీలు మన సైకాలజీని (మనస్తత్వాన్ని) బేస్ చేసుకుని ఆడే ఈ మైండ్ గేమ్‌ ఇది. ఈ ’99’ మ్యాజిక్ నంబర్ వెనక ఉన్న అసలు సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

షాపింగ్ మాల్స్ బిజినెస్ సీక్రెట్స్:

1. లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్ (Left-Digit Effect):
మన మెదడు ఎప్పుడైనా సరే ఏ సంఖ్యనైనా ఎడమ నుంచి కుడికి చదువుతుంది. ఉదాహరణకు ఒక టీషర్ట్ ధర రూ.499 అని ఉందనుకుందాం. మన కన్ను, మైండ్ మొదట ‘4’ అనే అంకెపైనే ఫోకస్ పెడతాయి. అది రూ.500 కు కేవలం ఒక్క రూపాయి మాత్రమే తక్కువ. కానీ మన సబ్‌కాన్షియస్ మైండ్ మాత్రం ఆ వస్తువు ధర రూ.400 రేంజ్‌లో ఉందనే భ్రమను కల్పిస్తుంది. అదే ఒకవేళ అక్కడ రూ.500 అని రాసి ఉంటే.. బాబోయ్ ఐదు వందలా! అని కాస్త వెనకడుగు వేస్తాం. ఈ సింపుల్ హ్యూమన్ సైకాలజీనే కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి.

Advertisement

2. చార్మ్ ప్రైసింగ్ (Charm Pricing):
బిజినెస్ ప్రపంచంలో ఈ స్ట్రాటజీని ‘చార్మ్ ప్రైసింగ్’ అంటారు. రౌండ్ ఫిగర్స్ (100, 200, 1000) అనేవి కస్టమర్లకు మానసికంగా కొంచెం ఖరీదైనవిగా అనిపిస్తాయి. అదే చివరిలో 9 లేదా 99 ఉంటే, “అబ్బా.. ఆఫర్ బాగుంది. మన బడ్జెట్‌లోనే దొరుకుతోంది” అని కస్టమర్లు హ్యాపీగా ఫీలవుతారు. తాము బెస్ట్ డీల్ పొందామనే తృప్తిని ఈ ప్రైసింగ్ ఇస్తుంది.

3. ఒక్క రూపాయి వెనక కోట్ల లాభాలు!
ఇదో రకమైన హిడెన్ బిజినెస్ లాజిక్. చాలా సార్లు మనం రూ. 499 వస్తువు కొని బిల్లింగ్ కౌంటర్ దగ్గర రూ.500 నోటు ఇస్తాం. ఆ ఒక్క రూపాయి చిల్లర లేకపోవడమో, లేదా మనమే అంత చిన్న మొత్తాన్ని లైట్ తీసుకోవడమో జరుగుతుంది. ఆ ఒక్క రూపాయిని మనం వదిలేస్తాం. కానీ ఆలోచించండి.. ఆ మాల్ లేదా బ్రాండ్‌కు రోజుకు వేలాది మంది కస్టమర్లు వస్తారు. అందరి దగ్గరా ఇలా ఒక్కో రూపాయి మిగిలిపోతే.. నెలకు లక్షల్లో, ఏడాదికి కోట్లలో బ్లాక్ మనీ లేదా టాక్స్-ఫ్రీ ప్రాఫిట్ నేరుగా కంపెనీల ఖాతాల్లోకి వెళ్తుంది. డిజిటల్ పేమెంట్స్ వచ్చాక ఇది కొంచెం తగ్గినప్పటికీ.. ఇప్పటికీ క్యాష్ ట్రాన్సాక్షన్లలో ఈ ప్రాఫిట్ చాలా ఎక్కువ.

Advertisement

Also Read: డిజిటల్ డిస్‌ప్లేతో వచ్చే.. బెస్ట్ బడ్జెట్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు.. ఇంకెందుకు ఆలస్యం

కస్టమర్లుగా మనం ఎలా అలర్ట్ అవ్వాలి?
రౌండ్ అప్ చేసి ఆలోచించండి: ఎప్పుడైనా రూ. 299 చూస్తే, మీ మైండ్‌లో దాన్ని రూ.300 గానే ఫిక్స్ చేసుకోండి.

బడ్జెట్ చెక్ చేసుకోండి: కేవలం ఎడమ అంకె చిన్నగా ఉందని అవసరం లేని వస్తువులను కార్ట్‌లో వేసుకోకండి.

షాపింగ్ మాల్స్ ఆడే ఈ స్మార్ట్ గేమ్స్ తెలుసుకుంటే.. మనం అనవసరమైన ఖర్చుల నుంచి సేవ్ అవ్వొచ్చు.

Tags

Related News

ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం

నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు

త్వరలో అదానీ ఎయిర్ లైన్స్.. ఆందోళన వ్యక్తం చేసిన ఇండిగో, ఎయిర్ ఇండియా

అప్పులు తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులు.. నెల ఆదాయం మొత్తం ఈఎంఐలు తీర్చడానికే..

సాహసం చేయబోతున్న ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ, జొమాటో ఆధిపత్యానికి సవాల్

బంగారం కొందామనుకుంటున్నారా? తగ్గింది కదా అని సంబరపడేలోపే బిగ్ ట్విస్ట్

బంగారు ఆభరణాలపై ఈ సీక్రెట్ కోడ్స్ గమనించారా? ఈ 916, 750, 585 నెంబర్లకు అర్థమేంటి?

దిగొచ్చిన పసిడి ధరలు.. ఇది తాత్కాలిక షాకా.. కొనుగోలుకు గోల్డెన్ ఛాన్సా?

Big Stories

Advertisement
×