E-Paper
Advertisement

ప్రస్తుత పరిస్థితులే నన్ను రాజకీయాల వైపు నడిపించాయి: రాఘవ లారెన్స్

ప్రస్తుత పరిస్థితులే నన్ను రాజకీయాల వైపు నడిపించాయి: రాఘవ లారెన్స్
Advertisement

Raghava Lawrence Politics: ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిణామాలే తనను ఈ నిర్ణయం తీసుకునేలా బలవంతం చేశాయని ఆయన వెల్లడించారు. ఆదివారం చెన్నైలోని తన నివాసంలో అభిమానులు, మద్దతుదారులతో ఏర్పాటు చేసిన కీలక సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read also-చేతిలో పుర్రె… 15 ఏళ్ల బాలిక మిస్సింగ్ తో మైండ్ బెండింగ్ మిస్టరీ థ్రిల్లర్

నిస్వార్థ సేవ కోసమే..

Advertisement

తన రాజకీయ ప్రయాణం గురించి వార్తా సంస్థ ఏఎన్‌ఐ (ANI) తో మాట్లాడిన లారెన్స్.. త్వరలోనే తన రాజకీయ కార్యాచరణను పూర్తి వివరాలతో ప్రకటిస్తానని తెలిపారు. “రాబోయే రోజుల్లో నా రాజకీయ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తాను. ప్రజలకు ఎలాంటి స్వార్థం, ఆశలు లేకుండా నిష్కల్మషంగా సేవ చేయాలనేదే నా ఏకైక లక్ష్యం. ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులు నన్ను నేరుగా రాజకీయాల్లోకి వచ్చేలా పురికొల్పాయి. ప్రజల నుంచి వచ్చే మద్దతు, వారి సలహాలను నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను” అని ఆయన పేర్కొన్నారు.

ఎక్స్‌ లో ఎమోషనల్

అభిమానుల సమావేశానికి ముందు లారెన్స్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పంచుకున్నారు. అందులో ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు.

Advertisement

“నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. నాకు డబ్బు సంపాదించాలనో, పెద్ద పెద్ద పదవులు అనుభవించాలనో ఎలాంటి ఆశ లేదు. నాకు నమ్మకమైన, సన్నిహితంగా ఉండే మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే, వారికి వెనుక ఉండి మద్దతు ఇవ్వాలని.. ఆ రకంగా సమాజానికి సేవ చేయాలని భావించాను. కానీ, ప్రస్తుత పరిస్థితులు నన్ను నేరుగా రంగంలోకి దిగేలా చేశాయి. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నా బాధ్యతను నేను నిర్వర్తించబోతున్నాను. ఈ తరుణంలో మీ అందరి సలహాలు, మార్గదర్శకత్వం నాకు ఎంతో అవసరం.”

అంతేకాకుండా, రాజకీయాలపై తనకున్న అవగాహన, తన జీవితంలోకి రాజకీయం ఎలా ప్రవేశించింది, ఈ నిర్ణయంపై తన తల్లి స్పందన ఏంటి అనే విషయాలను వివరిస్తూ ఒక వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

ఉప ఎన్నిక బరిలో లారెన్స్..?

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ రెండు నియోజకవర్గాల (తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్) నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే, నిబంధనల ప్రకారం ఒక సీటును వదులుకోవాల్సి రావడంతో ఆయన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు.

Read also-శామ్‌సంగ్ సర్ప్రైజ్.. ప్రకటనకు ముందే వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఫోన్..

ప్రస్తుతం ఖాళీ అయిన ఈ తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ మద్దతుతో లేదా స్వతంత్రంగా రాఘవ లారెన్స్ బరిలోకి దిగే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలను, ముఖ్యంగా టాస్మాక్ మద్యం దుకాణాల నియంత్రణను లారెన్స్ గతంలో అభినందించడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో ఒక భారీ బహిరంగ సభ ద్వారా లారెన్స్ తన పూర్తి రాజకీయ ప్రణాళికను వెల్లడించే అవకాశం ఉంది.

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×