E-Paper
Advertisement

ప్రతిభావంతులైన విద్యార్థులకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సత్కారం..

ప్రతిభావంతులైన విద్యార్థులకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సత్కారం..
Advertisement

TDF Student Support: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ సామాజిక బాధ్యతను చాటుకుంటూ మరోసారి వార్తల్లో నిలిచారు. తమ వివాహం తర్వాత ‘ది దేవరకొండ ఫౌండేషన్’ (TDF) ద్వారా సమాజానికి సేవ చేస్తామని, ముఖ్యంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తామని వారు గతంలో ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం, తాజాగా ఈ జంట విద్యార్థుల చదువులకు అండగా నిలిచేందుకు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Read also-ఒకటి కాదు ఏకంగా నాలుగు డస్టర్లు వచ్చేస్తున్నాయ్.. రెనాల్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Advertisement

తెలంగాణలోని అచ్చంపేట మండలానికి చెందిన 9వ, 10వ తరగతి చదువుతున్న 180 మంది అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ ఫౌండేషన్ ఎంపిక చేసింది. విద్యలో ప్రతిభ కనబరిచినందుకు గానూ వీరందరికీ ప్రత్యేక రివార్డులు, స్పాన్సర్‌షిప్‌లను అందించనున్నారు.

ఆనందం వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండ
ఈ సత్కార కార్యక్రమం మరియు ఎంపికైన విద్యార్థుల వివరాలను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Advertisement

“మేము మా నాన్నగారు పుట్టిన చిన్న గ్రామం అయిన తుమ్మన్‌పేట వైపు వెళ్తున్నాము. గత ఫిబ్రవరిలో నేను, రష్మిక కలిసి ఒక చిన్న కలని ప్రకటించాం. తెలంగాణలోని అచ్చంపేట మండలానికి చెందిన 9వ, 10వ తరగతి చదువుతూ, బాగా కష్టపడి చదివే విద్యార్థులను గుర్తించి వారికి బహుమతులు (రివార్డ్స్) ఇవ్వాలనుకున్నాం. తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేసిన ఆ 180 మంది పిల్లల జాబితా ఇదిగో” అంటూ ఆయన ఎంతో సంతోషంగా పోస్ట్ పెట్టారు.

సామాజిక సేవలో ‘ది దేవరకొండ ఫౌండేషన్’
విజయ్ దేవరకొండ స్థాపించిన ‘ది దేవరకొండ ఫౌండేషన్’ గతంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ‘మిడిల్ క్లాస్ ఫండ్’ ఏర్పాటు చేసి వేలాది మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ ట్రస్ట్ తన పరిధిని పెంచుకుంటూ కమ్యూనిటీ వెల్ఫేర్, యువతకు ఉపాధి కల్పన, మరియు ఉచిత విద్య వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఈ ఫౌండేషన్‌లో భాగస్వామి కావడంతో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతమయ్యాయి.

Read also-హైబ్రిడ్ కార్లపై మారుతి సూపర్ ఆఫర్లు.. ఏకంగా రూ. 2.15 లక్షల తగ్గింపు!

సినిమా ముచ్చట్లు
ఒకవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే, ఈ జంట తమ సినిమాలతోనూ బిజీగా గడుపుతున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబలి’, ‘రౌడీ జనార్దన్’ వంటి వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లలో నటిస్తుండగా, రష్మిక మందన్న కూడా పలు భారీ పాన్-ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సమాజం పట్ల తమకున్న బాధ్యతను మరవకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఈ స్టార్ కపుల్‌పై నెటిజన్లు మరియు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×