E-Paper

‘విశ్వంభర’ సమ్మర్ మిస్.. దసరా రేసులోకి మెగాస్టార్? సస్పెన్స్‌లో ఫ్యాన్స్!

‘విశ్వంభర’ సమ్మర్ మిస్.. దసరా రేసులోకి మెగాస్టార్? సస్పెన్స్‌లో ఫ్యాన్స్!
Advertisement

Vishwambhara Release Date: టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ విడుదలపై రోజుకో ప్రచారం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో వస్తున్న ఈ విజువల్ వండర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ చుట్టూ నడుస్తున్న సస్పెన్స్ ఇప్పుడు మెగా అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Read also-‘లగాన్’ 25 ఏళ్ల వేడుక.. సరికొత్త లుక్‌లో సల్మాన్ ఖాన్.. కరీనా, జూహీ చావ్లా సందడి!

Advertisement

సమ్మర్ రిలీజ్ అన్న మెగాస్టార్..

నిజానికి, గతంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఒక వీడియో బైట్‌లో మాట్లాడుతూ.. సినిమా రెండో భాగంలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) వర్క్ చాలా కీలకంగా ఉందని, అందుకే సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. దీంతో ఈ వేసవికి మెగాస్టార్ మ్యాజిక్ థియేటర్లలో చూడొచ్చని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడ్డారు. కానీ, సమ్మర్ సీజన్ గడుస్తున్నా మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పైగా టీజర్ తర్వాత ప్రమోషన్స్ కూడా నత్తనడకన సాగుతుండటంతో సమ్మర్ రేసు నుంచి ‘విశ్వంభర’ తప్పుకుందనేది దాదాపు స్పష్టమైంది.

Advertisement

కొత్త టార్గెట్ దసరా పండుగేనా?

సమ్మర్ రేస్ మిస్ అవ్వడంతో యువి క్రియేషన్స్ సంస్థ ఇప్పుడు సినిమాను మరో పెద్ద హాలిడే సీజన్‌పైకి షిఫ్ట్ చేసినట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఎలాగైనా ఈ ఏడాది దసరా పండుగ సెలవులను క్యాష్ చేసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జూలై లేదా ఆగస్టు నాటికి గ్రాఫిక్స్ పనులన్నీ వంద శాతం పూర్తయితే.. దసరా కానుకగా అక్టోబర్ రేసులో సినిమాను నిలబెట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Read also-సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. 130 అడుగుల ఎత్తు నుంచి యువతిని తోసేసి..

బాక్సాఫీస్ వద్ద ‘మెగా’ క్లాష్ తప్పదా?

ఒకవేళ ‘విశ్వంభర’ దసరాకు వస్తే, బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా ఉండదు. ఇప్పటికే దసరా సీజన్‌ను టార్గెట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబో మూవీతో పాటు, వెంకటేష్ – త్రివిక్రమ్ ల క్రేజీ ప్రాజెక్ట్ (AK47) కూడా లైన్లో ఉన్నాయి. సీనియర్ హీరోలంతా ఒకే సీజన్‌లో బరిలోకి దిగితే థియేటర్ల సర్దుబాటు పెద్ద టాస్క్ కానుంది. అయినప్పటికీ, లాంగ్ హాలిడేస్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మేకర్స్ దసరా వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ‘విశ్వంభర’ సమ్మర్ అప్‌డేట్ లేకపోవడంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు, ఈ దసరా రిలీజ్ బజ్ కాస్త ఊరటనిస్తోంది. మరి త్వరలోనే చిత్ర యూనిట్ ఈ సస్పెన్స్‌కు తెరదించి, అఫీషియల్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తుందేమో చూడాలి!

Related News

పెళ్లి రోజున కవల పిల్లల మొదటి ఫోటో షేర్ చేసి ఉపాసన ఎమోషనల్..

‘లగాన్’ 25 ఏళ్ల వేడుక.. సరికొత్త లుక్‌లో సల్మాన్ ఖాన్.. కరీనా, జూహీ చావ్లా సందడి!

ఆ బుల్లితెర నటికి ఆడపిల్ల.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు.. ‘దంగల్’ కంటే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకే ఎక్కువ ఆదరణ!

‘కాక్‌టెయిల్ 2’ ఈవెంట్‌లో రష్మికకు రక్షణగా నిలిచిన బాలీవుడ్ నటి.. అసలు ఏం జరిగిందంటే?

ప్రతిభావంతులైన విద్యార్థులకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సత్కారం..

బాక్స్ ఆఫీస్ వద్ద ‘పెద్ది’ ప్రభంజనం: 10 రోజుల్లో రూ. 378 కోట్ల కలెక్షన్లు!

×