E-Paper
Advertisement

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు.. ‘దంగల్’ కంటే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకే ఎక్కువ ఆదరణ!

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు.. ‘దంగల్’ కంటే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకే ఎక్కువ ఆదరణ!
Advertisement

Peddi Dangal Comparison: దర్శకుడు బుచ్చిబాబు సన రూపొందించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే భారతదేశంలో రూ.200 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ‘పెద్ది’ చిత్రాన్ని ఆమీర్ ఖాన్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘దంగల్’తో పోల్చారు.

Read also-మీ పిల్లలు స్నాప్‌చాట్ వాడుతున్నారా? అయితే ఈ కొత్త ప్రైవసీ ఫీచర్లు కచ్చితంగా తెలుసుకోండి!

Advertisement

దర్శకుడు బుచ్చిబాబు సనతో మాట్లాడిన చిరంజీవి, తనకు ‘చక్ దే! ఇండియా’, ‘దంగల్’ వంటి క్రీడా నేపథ్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేదని, కానీ తనకు ఆ అవకాశం రాలేదని చెప్పారు. దంగల్, పెద్ది సినిమాల మధ్య తేడాలను వివరిస్తూ… “‘దంగల్’ అనేది ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. కానీ ‘పెద్ది’ అనేది పల్లెటూరి వాతావరణంలో, మట్టి వాసనలతో కూడిన రా స్పోర్ట్స్ డ్రామా. ఇది సమాజంలో అవగాహన కల్పించడమే కాకుండా ప్రజల్లో స్ఫూర్తిని నింపుతుంది. ప్రభుత్వాలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విద్యాసంబంధిత చిత్రం. అందుకే ఈ చిత్రానికి ‘దంగల్’ కంటే సుదీర్ఘ కాలం పాటు విస్తృతమైన ఆదరణ లభిస్తుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

చివరగా ఆయన ఎమోషనల్ అవుతూ… “ఇలాంటి అద్భుతమైన కథ నా కొడుకు రామ్ చరణ్‌కు దక్కింది. నేను మిస్ అయిన అవకాశాన్ని వాడు అందుకున్నాడు. ఇప్పుడు అందరూ ‘రామ్ చరణ్, చిరంజీవిని మించిపోయాడు’ అని అంటున్నారు. ఒక తండ్రిగా ఆ మాటలు వినడం నాకు ఎంతో గర్వంగా ఉంది” అని నవ్వుతూ చెప్పారు.

Advertisement

Read also-యాదాద్రి జిల్లాలో విషాదం.. గేట్ టుగెదర్ పార్టీలో టెక్కీ అనుమానస్పద మృతి!

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాలో ఒక యువకుడు క్రికెట్, కుస్తీ, పరుగు పందెం వంటి క్రీడల్లో రాణించి, భారత ప్రభుత్వం నుండి గుర్తింపు తెచ్చుకునే ప్రయాణాన్ని చూపించారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు, శివరాజ్‌కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శలకు దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి, వివాదాస్పద సీన్లను తొలగించిన తర్వాత కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని కొనసాగిస్తోంది.

Related News

సీత పాత్రతో జాక్‌పాట్ కొట్టిందా?.. సాయి పల్లవి రెమ్యూనరేషన్‌పై కొత్త టాక్!

ఇద్దరి ఫ్రెండ్షిప్ మళ్లీ వైరల్.. జాన్వీ పోస్ట్‌తో రచ్చ!

టీజర్ చూసి అప్పుడే తీర్పా?.. ‘రామాయణం’పై ఇదేం హడావిడి!

‘ది పారడైస్’ టీజర్‌కి ఇక డేట్ ఫిక్స్…తగలబెట్టేయ్ అంటున్న ఫ్యాన్స్ !

మహేష్ ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారా.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

‘పారడైస్’కి మళ్లీ బడ్జెట్ షాక్?.. నాని ఫుల్ టెన్షన్‌లో ఉన్నాడా?

రెండో పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన సురేఖ వాణి!

రష్మికకు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×