Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో మన శంకర వరప్రసాద్ గారు ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తుంది. ఈ కాంబో చాలా అంటే చాలా డిఫరెంట్. ఎందుకంటే.. గాడ్ ఫాదర్ సినిమాలో నయన్.. చిరుకు చెల్లిగా నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో భార్యగా నటిస్తుంది. అందుకే వీరి కాంబోపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి.. ఈసారి చిరుకు కూడా మరో ఇండస్ట్రీ హిట్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెల్సిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే సాంగ్ వినిపిస్తుంది.. కనిపిస్తుంది.
ఇక చిరు – అనిల్ కంబోనే హైలైట్ అనుకుంటే.. ఈ సినిమాను మరింత హైప్ తీసుకురావడానికి ఇందులో విక్టరీ వెంకటేష్ ఒక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అసలు ఇలాంటి ఒక కాంబో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు ఒక స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ హీరో నటించడం కామన్ ఏమో కానీ.. ఇప్పుడు అది పెద్ద అచీవ్ మెంట్ అన్నట్లుగా మారిపోయింది.
ఒకప్పుడు వెంకీ సినిమాలో స్టార్ హీరోలందరూ ఒక సాంగ్ లో కలిసి నటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కలయిక ఇంకెక్కడా కనిపించలేదు. ఇప్పుడు మరోసారి ఆ కాంబో కలిసింది. తాజాగా వెంకటేష్.. మన శంకరవరప్రసాద్ సినిమా సెట్ లో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చిరు – వెంకీ వింటేజ్ లుక్స్ నుంచి ఇప్పుడు సెట్ లో ఉన్న లుక్ వరకు చూపించారు.
సెట్ లోకి అడుగుపెట్టగానే చిరు.. వెంకీని సాదరంగా ఆహ్వానించాడు. వెల్కమ్ వెంకీ బ్రదర్ అని చిరు అనగా.. మై బాస్.. చిరు అంటూ వెంకీ ఆప్యాయంగా హాగ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు మన శంకర వరప్రసాద్ సెట్లో పెళ్లికానీ ప్రసాద్.. ఇది కదా ఇండస్ట్రీకి కావాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంత హైప్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
Happy to share the screen with my dear Megastar @Kchirutweets in #ManaShankaraVaraPrasadGaru ❤️
And back again with my most favourite @AnilRavipudi for another Sankranthi 😉😉😉
This Sankranthi is going to be a truly special one ❤️ https://t.co/ego4ahGgk6
— Venkatesh Daggubati (@VenkyMama) October 23, 2025