BigTV English

Salman Khan: అప్పట్లో 25 కేసులు.. ఇప్పుడు ఏకంగా పార్టీలో చోటు.. రౌడీ షీటర్ సల్మాన్ ఖాన్‌పై కేటీఆర్ ప్రశంసలు

Salman Khan: అప్పట్లో 25 కేసులు.. ఇప్పుడు ఏకంగా పార్టీలో చోటు.. రౌడీ షీటర్ సల్మాన్ ఖాన్‌పై కేటీఆర్ ప్రశంసలు
Advertisement

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ విజయం కోసం బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ అనే ఓ రౌడీషీటర్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అతనిపై ఏకంగా 25 కేసులున్నాయి. అలాంటి రౌడీషీటర్ కి స్వయంగా పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు కేటీఆర్. అంతే కాదు, ఆయన దేశోద్ధారకుడు, యువ నాయకుడు, కాబోయే మహా నాయకుడంటూ ప్రశంసల జల్లు కురిపించారు.


పేరుమోసిన రౌడీషీటర్..
హైదరాబాద్ యూత్ కరేజ్ అనే సంస్థ స్థాపించి దాని ద్వారా తన కార్యకలాపాలు నిర్వహించేవారు సల్మాన్ ఖాన్. రౌడీషీటర్ గా పేరు మోసిన ఆయనపై వివిధ కేసులున్నాయి. పోక్సో యాక్ట్, పీడీ యాక్ట్ కూడా ఉన్నాయి. మొత్తం 25 కేసులు అతడిపై నమోదయ్యాయి. ఇవన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బనాయించడం విశేషం. అలాంటి రౌడీ షీటర్ ఇప్పుడు బీఆర్ఎస్ కి ముఖ్యుడైపోయాడు. నేరుగా కేటీఆరే వచ్చి అతడికి పార్టీ కండువా కప్పడం మరింత విశేషం. రౌడీషీటర్ కి పార్టీలో చోటెలా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో కేటీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు.

గతంలో అలా..
గతంలో సల్మాన్ ఖాన్.. కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మైనార్టీల స్థలాలను వారు కబ్జా చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారి అక్రమాలకు వ్యతిరేకంగా కొన్ని వీడియోలను విడుదల చేశాడు సల్మాన్ ఖాన్. అప్పట్నుంచి సల్మాన్ పై బీఆర్ఎస్ కక్షగట్టింది. అంతమాత్రాన అతడు నీతిమంతుడని చెప్పలేం. 25 కేసులతో అతడు పేరుమోసిన రౌడీషీటర్ గా స్థానికులను భయభ్రాంతులకు గురిచేసేవాడని అంటున్నారు. అలాంటి రౌడీ షీటర్ అండతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించాలని చూస్తోంది బీఆర్ఎస్.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే టార్గెట్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కేటీఆర్, ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్డం లేదు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సల్మాన్ ఖాన్ నామినేషన్ వేశారు. అయితే ఆ నామినేషన్ ని వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్ లో చేరారు సల్మాన్ ఖాన్. జూబ్లీహిల్స్ ప్రాంతంలో మైనార్టీ ఓట్లకు గేలం వేసేందుకు కేటీఆర్ ఈ ప్రయత్నం చేశారని అంటున్నారు. వాస్తవానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి ఎంఐఎం మద్దతిస్తోంది. దీంతో మైనార్టీల ఓట్లు గంపగుత్తగా నవీన్ యాదవ్ కి పడతాయనే ప్రచారం మొదలైంది. దీంతో బీఆర్ఎస్ ఇక్కడ పట్టు నిలుపుకోడానికి సల్మాన్ ఖాన్ ని రంగంలోకి దింపింది. రౌడీషీటర్ అయినా కూడా అతడిని పార్టీలో చేర్చుకుని, ప్రచారానికి పంపించబోతున్నారు. మాగంటి గోపీనాథ్ భార్య సునీత విషయంలో ఇటీవల వచ్చిన వార్తలు పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. దీంతో అభ్యర్థికంటే ఎక్కువగా పార్టీ పేరుని, గుర్తుని జనాల్లోకి తీసుకెళ్లేలా బీఆర్ఎస్ ప్లాన్ గీసింది. ఆ పార్టీ ఓట్లకోసం ఎంతకైనా తెగిస్తుందని చెప్పడానికి సల్మాన్ ఖాన్ చేరికే తాజా ఉదాహరణ అంటున్నారు నెటిజన్లు.

Also Read: ఆయనకు న సిగ్గు.. న లజ్జ.. జగన్ ఘాటు వ్యాఖ్యలు

Related News

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం.. మల్లారెడ్డి చిలక పలుకులు, అదంతా మాయ

Indiramma Housing Scheme: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. ఇకపై పట్టణాల్లో కూడా ఆ స్కీమ్

Bus Service: ఎట్టకేలకు ఆ ఊరికి బస్సు సర్వీస్ ప్రారంభం.. 30 ఏళ్ల కల నెరవేరిన వేళ గ్రామస్తుల హర్షం..

Maganti Suneetha: మాగంటి గోపీనాథ్ కు సునీత భార్య కాదా? నామినేషన్ లో అసలు ట్విస్ట్..

Check Posts: తెలంగాణలో అన్ని రవాణా చెక్‌పోస్టుల రద్దు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

Jubilee Hills By-Election: జూబ్లీ‌హిల్స్ బైపోల్.. వీకెండ్‌లో ప్రచారానికి కేసీఆర్? ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ

Hyderabad News: నా చావుకు కేటీఆర్, ఆ నేతలే కారణం.. బీఆర్ఎస్ మహిళా కార్యకర్త పోస్ట్ వైరల్

Big Stories

×