AP Politics: టీడీడీ ఎమ్మెల్యే బాలకృష్ణపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్. ఆయనకు కౌంటర్ ఇవ్వడమేకాదు.. పనిలోపనిగా స్పీకర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల కిందట అసెంబ్లీలో ఏం జరిగింది? అప్పుడు బాలకృష్ణ ఏమన్నారు? దానికి మాజీ సీఎం జగన్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు? అనేది ఇప్పుడు చూద్దాం.
బాలకృష్ణపై మాజీ సీఎం రుసరుసలు
సరిగ్గా నెల రోజుల కిందట అంటే సెప్టెంబర్ 25న బాలకృష్ణ వ్యాఖ్యలకు ఏపీ అసెంబ్లీ వేదికైంది. వైసీపీ హయాంలో సినిమా పెద్దలను పిలిచి అవమానించారనే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. దీనిపై ఎమ్మెల్యే బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. ఆయన్ని సైకోగా వర్ణించారు. ఆ మాటలకు చాలామంది షాకయ్యారు. తాజాగా ఆ ఎపిసోడ్‌పై వైసీపీ అధినేత జగన్ రియాక్ట్ అయ్యారు.
గురువారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారు. అదే సమయంలో అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, డిప్యూటీ సీఎం పవన్ మౌనంపై ఓ రిపోర్టర్ స్పందన అడిగారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ప్రశ్నించారు మాజీ సీఎం.
స్పీకర్‌కు బుద్దిలేదన్న జగన్
పని పాటా లేని సంభాషణను బాలకృష్ణ తీసుకొచ్చారని, అసెంబ్లీలో తాగి మాట్లాడారని అన్నారు. తాగినవారు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక ప్రవర్తన ఎలా ఉందో ఆయన్ని ఆయన ప్రశ్నించుకోవాలన్నారు. తాగిన వ్యక్తి సభలో మాట్లాడనిస్తు న్నారంటే స్పీకర్‌కు బుద్ధి లేదన్నారు. ఆ సమయంలో స్పీకర్ ఛైర్‌లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఉన్నారు.
బాలకృష్ణపై జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ స్లోగన్‌ని గుర్తు చేస్తున్నారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ’ నినాదం ఆ పార్టీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆ అంశంపై సదరు ఎమ్మెల్యే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ని కోరారని గుర్తు చేస్తున్నారు.
ALSO READ: ఆయనకు న సిగ్గు.. న లజ్జ, జగన్ ఘాటు వ్యాఖ్యలు
బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్‌పై జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ఆయనంటే.. ఇప్పుడు జగన్ అన్నారని అంటున్నారు. బాలకృష్ణ మాట్లాడిన సమయంలో స్పీకర్‌గా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఉన్నారు. మరి జగన్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఎమ్మెల్యే బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి?
బాలకృష్ణ తాగి మాట్లాడింది ఏంటి?
తగిన వ్యక్తిని సభలో మాట్లాడనిస్తున్నారంటే స్పీకర్ కు బుద్ధి లేదు
అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రశ్నించుకోవాలి
— BIG TV Breaking News (@bigtvtelugu) October 23, 2025