BigTV English

Nagavamshi: ఆ బడా ప్రొడ్యూసర్ ను నమ్మి తప్పు చేశాం.. రియాలిటీలోకి వచ్చిన నాగ వంశీ!

Nagavamshi: ఆ బడా ప్రొడ్యూసర్ ను నమ్మి తప్పు చేశాం.. రియాలిటీలోకి వచ్చిన నాగ వంశీ!
Advertisement

Nagavamshi: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా సక్సెస్ అందుకున్న వారిలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత నాగ వంశీ (Nagavamshi)ఒకరు. ఈయన తన బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాకుండా ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు. త్వరలోనే నాగ వంశీ నిర్మాణంలో రవితేజ(Raviteja) శ్రీ లీల(Sreeleela) హీరో హీరోయిన్ గా నటించిన మాస్ జాతర(Mass Jathara) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రవితేజతో పాటు నిర్మాత నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.


ఆదిత్య చోప్రాను గుడ్డిగా నమ్మాము..

ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాగ వంశీ సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాలను ప్రస్తావనకు తీసుకువచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్(NTR) ఇటీవల నటించిన వార్2(War 2) సినిమా గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)దర్శకత్వంలో ఆదిత్య చోప్రా(Aditya Chopra) నిర్మాణంలో యశ్ రాజ్ ఫిలిం యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు హక్కులను నాగ వంశీ భారీ ధరలకు కొనుగోలు చేశారు. అయితే ఈ సినిమా ద్వారా నాగ వంశీ నష్టాలను ఎదుర్కొన్నారు. మాస్ జాతర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వార్ 2 సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఎన్టీఆర్ పవర్ ఇండియా మొత్తం తెలియాలి..

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగ వంశీ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. అన్న పవర్ ఇండియా మొత్తం తెలియాలి . వార్ 2 సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే ఒక్క రూపాయి అయినా మనం ఎక్కువ రాబట్టాలి. ఇన్ని రోజులు అన్న మన కోసం కాలర్ ఎగరేశారు కానీ ఇప్పుడు ఇండియా మొత్తం అన్న కాలర్ ఎగరేసేలా మనం చేయాలి అంటూ అభిమానులను ఉద్దేశించి నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ఈ విషయం గురించి రవితేజ మాట్లాడుతూ ఆరోజు నువ్వు అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నట్టు లేదు వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది అంటూ తెలిపారు.


తప్పులు అందరూ చేస్తారు..

ఇక ఈ ప్రశ్నకు నాగ వంశీ మాట్లాడుతూ ఆదిత్య చోప్రా చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఆయన యశ్ రాజ్ యూనివర్స్ లో భాగంగా సినిమా చేస్తున్నారని తెలియగానే నేను ఎన్టీఆర్ గారు ఇద్దరు నమ్మామని కానీ అటువైపు తప్పు జరిగిపోవడంతో మేము కూడా మోసపోయామని తెలిపారు. తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు అటువైపు తప్పు జరిగిపోయింది ఇటువైపు మేము దొరికిపోయాము అంటూ ఇన్ని రోజులకు వార్ 2 సినిమా విషయంలో నాగ వంశీ నిజాలను ఒప్పుకుంటూ రియాలిటీలోకి వచ్చారు. ప్రస్తుతం నాగ వంశీ వార్ 2 సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నారు. ఇక మాస్ జాతర సినిమా విషయానికి వస్తే భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ శ్రీ లీల నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.

Also Read: Kiran Abbavaram : కె ర్యాంప్ క్రెడిట్ అంతా నాకే… వాళ్లకు ఏం సంబంధం లేదు

Related News

Mass Jathara: మాస్ జాతర వాయిదా.. ఆ సినిమానే కారణమా.. కావాలనే చేశారా?

Megastar Chiranjeevi: మన శంకర్ వరప్రసాద్ గారు సెట్ లో విక్టరీ వెంకటేష్, రేపు అఫీషియల్ వీడియో

Kalyan Ram: ఈసారి తమ్ముడు కన్నా అన్న హైలైట్ అయ్యేలా ఉన్నాడే..

Naga Vamsi: ఓజీ సినిమాలో కళ్యాణ్ అసలేం చేశారు ? నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్

Dhruv Vikram : మొదటి స్పీచ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా, ఎంత స్పష్టంగా మాట్లాడాడో 

Sobhita: బొట్టు ఎక్కడ?, ఇది దీపావళా.. రంజానా.. శోభిత డ్రెస్సింగ్‌పై ట్రోల్స్‌!

Venkatesh Trivikram : వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు

Big Stories

×