BigTV English

Venky – Trivikram: వెంకీ మామ టైం వచ్చేసింది… గురూజీ పక్కా ప్లాన్‌

Venky – Trivikram: వెంకీ మామ టైం వచ్చేసింది… గురూజీ పక్కా ప్లాన్‌

Venkatesh-Trivikram Movie: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ మధ్య కాస్త సైలెంట్‌ అయ్యారు. మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ చేయబోయే సినిమా బన్నీతో ఉండాల్సింది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా జరిగిది. బన్నీ కోసం త్రివిక్రమ్.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. పుష్ప 2 తర్వాత ఇది సెట్స్ వస్తుందని కూడా అన్నారు. తీరా చూస్తే బన్నీ.. తమిళ్ డైరెక్టర్ అట్లీకి ఒకే చెప్పాడు. ఇక బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్అ క్యాన్సిల్ అయింది.


అదే ప్రాజెక్ట్ ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ‘దేవర 2’ ఉంటుంది. వీటి తర్వాతే త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మూవీ ఉంటుంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం వెంకీమామతో జతకట్టాడు. విక్టరి వెంకటేష్ తో మూవీ చేస్తున్నట్టు ప్రకటన కూడా ఇచ్చారు.  అలా వెంకటేష్ – త్రివిక్రమ్ మూవీ కుదిరింది. దీనికి వెంకీ 77(Venky 77) అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. రీసెంట్‌గా ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.

అక్టోబర్ 6 నుంచి షూటింగ్

తాజాగా ఈ వెంకటేష్ – త్రివిక్రమ్ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తుంది. త్రివిక్రమ్ సినిమాలన్నీ కేవలం కొంత మంది స్టార్స్‌తోనే ఉంటాయి. అయితే, వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు 3 సినిమాలు వచ్చాయి. కాకపోతే అవి డైరెక్టర్‌గా కాదు. వాసు మూవీ డైలాగ్స్ రాశాడు.  ఇక నువ్వు నాకు నచ్చావు, మళ్లీశ్వరీ సినిమాలకు కథతో పాటు డైలాగ్స్ రాశాడు త్రివిక్రమ్. డైరెక్టర్‌గా టర్న్ అయిన తర్వాత వెంకీతో సినిమా చేయలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ పుణ్యమా అని… అది జరగబోతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వెంకటేష్ – త్రివిక్రమ్ మూవీ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ఈ వెంకీ 77 మూవీ సెట్స్‌పైకి అక్టోబర్ 6వ తేదీ నుంచి వెళ్తుందట.


వెంకీ పక్కన యంగ్ బ్యూటీ ?

హీరోతో పాటు కీ రోల్స్‌పై అప్పటి నుంచే ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లోనే ఉండబోతుందట. అక్టోబర్ 6 నుంచి రెగ్యూలర్ షూటింగ్ చేసుకోబోతున్న వెంకీ 77 మూవీలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టిని తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. కానీ, కొంత మంది హీరోయిన్స్ పేర్లను పరిశీలించిన తర్వాత శ్రీనిధి శెట్టి పేరునే గురూజీ ఫైనల్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

రంగంలోకి యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ ?

నిజానికి త్రివిక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ను మార్చడు. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు దేవి శ్రీ ప్రసాద్, థమన్‌తో మాత్రమే చేశాడు. మధ్యలో అ. ఆ సినిమాకు మిక్కి జే మేయర్‌ను తీసుకున్నాడు. ఇప్పుడు మరోసారి మ్యూజిక్ డైరెక్టర్‌ను మారుస్తున్నట్టు తెలుస్తుంది. యానిమల్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ వెంకీ 77 మూవీకి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడట.

Related News

OG Trailer: పేల్చిపడేస్తాం… ట్రైలర్ లేట్ అయితే సారీ చెప్పలేదు.. కానీ, బాగా కవర్ చేశారు!

 Kalki2 : దీపిక ప్లేస్‌లో స్వీటీ… మళ్లీ పెళ్లి వార్తలు వచ్చేస్తాయేమో

Aamir Khan: మల్టీప్లెక్స్ తీరుపై మండిపడిన అమీర్ ఖాన్… పద్ధతి మార్చుకోవాలంటూ!

Sujeeth: ఆయన వల్లే ఈ స్థాయి.. సుజీత్ ఎమోషనల్ కామెంట్స్!

Kamal Haasan: సభలకు వచ్చే వాళ్లంతా ఓటేయరు.. హీరో విజయ్‌కి కమల్‌ కౌంటర్‌!

Chiranjeevi: కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనబడే నేను.. 47 ఏళ్ల నట ప్రస్థానానికి పునాది

Avika Gor: పెళ్లి పీటలు ఎక్కబోతున్న చిన్నారి పెళ్ళికూతురు.. ముహూర్తం ఫిక్స్!

Big Stories

×