Air India: బెంగళూరు ఎయిర్ ఎండియా విమానంలో హైజాక్ కలకలం రేగింది. కాక్ పిట్ డోర్ తెరిచేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నం చేశాడు. దీంతో భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే విమానం హైజాక్ అవుతోందన్న భయంతో పైలట్ డోర్ తెరవలేదు. పోలీసులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. విమానం బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు వెల్లడించారు.
⦿ వాష్ రూం అనుకుని.. కాక్ పిట్ డోర్ తెరిచేందుకు..?
బెంగళూరు నుంచి వారణాసి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఓ ప్రయాణికుడు మొదటిసారి ఫ్లైట్ లో ఎక్కాడని అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రయాణికుడు విమానం గాలిలో ఉండగా కాక్‌పిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించాడని చెప్పారు. అతను తొలిసారి విమానంలో ప్రయాణించడంతో.. టాయిలెట్ కోసం వాష్ రూంకి వెళ్లాల్సింది పోయి… కాక్ పిట్ తెరిచేందుకు ప్రయత్నించాడని వివరించారు. దీంతో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొందని అన్నారు.
ALSO READ: AAI Recruitment: రూ.1,40,000 జీతంతో భారీగా ఉద్యోగాలు.. బంగారం లాంటి జాబ్, దరఖాస్తుకు 5 రోజులే గడువు
⦿ పోలీసుల అదుపులో ప్రయాణికుడు..
అయితే అప్రమత్తం అయిన విమాన సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అది వాష్ రూం కాదని.. కాక్ పిట్ డోర్ అని అతనికి వివరించారు. ప్రయాణికుడు సైలెంట్ అక్కడ నుంచి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. విమానం ల్యాండ్ అయిన తర్వాత, ప్రొటోకాల్ ప్రకారం ఆ ప్రయాణికుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి అప్పగించారు. ఈ విషయం ప్రస్తుతం విచారణలో ఉందని ఓ ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: IBPS Recruitment: బిగ్ గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో 13,217 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు