Abhishek Sharma: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో…టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ములేపుతున్నాడు. ప్రతీ మ్యాచ్ లో 200 కు పైగా స్ట్రైక్ రేట్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే.. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ కు ఓ అందమైన అమ్మాయి… ప్రపోజ్ చేసింది. ఇండియా నుంచి మ్యాచ్ చూసేందుకు దుబాయ్ వెళ్లిన సుజిత అనే యువతి… మ్యాచ్ జరుగుతుండగానే… లవ్ యూ అభిషేక్ శర్మ అంటూ అరిచేసింది. అంతేకాదు… ప్లైయింగ్ కిస్సులు పెట్టింది. ఈ వీడియో వైరల్ గా మారింది.
Also Read: Ind Vs Pak: చల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్…సిక్స్ కొట్టి మరీ
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ 4 నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ తుక్కురేగ్గొట్టాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అభిషేక్ శర్మ. 39 బంతుల్లోనే… 74 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్సర్లు, 5 బౌండరీలు బాదేశాడు. ఈ తరుణంలోనే…. అభిషేక్ శర్మ కు ప్రపోజ్ చేశాడు. సుజిత అనే సోషల్ మీడియా స్టార్ ఈ పని చేసి.. వైరల్ గా మారింది. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో…. అభిషేక్ శర్మ ను గట్టిగా పిలుస్తూ… ఐ లవ్ యూ అంటూ పేర్కొంది. ఆ తర్వాత… ఫ్లైయింగ్ కిస్సులు కూడా ఇచ్చింది. టీమిండియా సూపర్ స్టార్ అంటూ వ్యాఖ్యానించింది. అయితే… ఆ లేడీ.. ఎంత అరిచినా.. అభిషేక్ శర్మ అస్సలు పట్టించుకోలేదు.