BigTV English
Advertisement

Vidhyabalan: ఆ డైరెక్టర్ ఇబ్బంది పెట్టారు.. ఊహించని కామెంట్స్ చేసిన విద్యాబాలన్!

Vidhyabalan: ఆ డైరెక్టర్ ఇబ్బంది పెట్టారు.. ఊహించని కామెంట్స్ చేసిన విద్యాబాలన్!

Vidhyabalan:బాలీవుడ్ నటి విద్యాబాలన్(Vidhya Balan) అంటే సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందే సౌత్ సినిమాల ద్వారా. అయితే సినిమాలైతే సౌత్ లో చేసింది. కానీ అంతకుముందే ఏక్తా కపూర్ నిర్మించిన సీరియల్ ద్వారా బాలీవుడ్లోకి సినీ రంగ ప్రవేశం చేసింది. అదే సమయంలో హీరోయిన్ అవ్వాలని బలంగా కోరుకున్న విద్యాబాలన్ పేరెంట్స్ కి చెప్పగా.. చదువు పూర్తి చేయమనడంతో చేసేదేమీ లేక చదువు పూర్తి చేసింది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో విద్యాబాలన్ ఎన్నో రకాల అవమానాలు ఫేస్ చేసిందట. ముఖ్యంగా ఓ డైరెక్టర్ అయితే తనని సర్జరీ చేయించుకోమని తెగ టార్చర్ చేశాడట. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..? విద్యాబాలన్ ని ఎందుకు సర్జరీ చేయించుకోమని కోరాడు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ఆ డైరెక్టర్ బలవంత పెట్టారు – విద్యాబాలన్

సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎవరి పరిస్థితి అయినా ఒకేలా ఉంటుంది. అయితే బడా ఫ్యామిలీ నుండి వచ్చిన వారి సినిమాలు కూడా హిట్ అయితేనే.. వారికి ఇండస్ట్రీలో పేరుంటుంది. అలా సినిమాల మీద ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విద్యాబాలన్ కి తొలినాళ్లలో చాలానే అవమానాలు, వేధింపులు, ఛీత్కారాలు ఎదురయ్యాయట. ముఖ్యంగా ఓ దర్శకుడు విద్యాబాలన్ ని అందం కోసం సర్జరీ చేయించుకోమని వెంటపడి మరీ సూచించారట. అయితే ఈ విషయాన్ని విద్యాబాలన్ తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఎవరో ఏమో అంటే నువ్వు పట్టించుకోకు.. అందం గురించి పట్టింపులు అస్సలు పెట్టుకోకని సూచించడంతో సర్జరీ చేయించుకోలేదట. అలా లావుగా ఉన్నా సరే విద్యాబాలన్ తన నటనతోనే అందర్నీ ఆకట్టుకుంటుంది.


పోటీ పడ్డ డిజైనర్లు..

ముఖ్యంగా ఎక్కడికి వెళ్లినా కూడా విద్యాబాలన్ తనదైన స్టైల్ లో చీరకట్టుతో కనిపించి.. చీర కట్టుకే ట్రేడ్ మార్క్ గా మారిపోయింది.అలా ఈ హీరోయిన్ కి చీరలు స్పెషల్ గా డిజైన్ చేయడం కోసం ఎంతోమంది డిజైనర్లు కూడా పోటీ పడతారు.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవమానాలు, చీత్కారాలు..

అయితే సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో విద్యాబాలన్ కి వరుస చేదు అనుభవాలు ఎదురయ్యాయట. ఎందుకంటే ఈమెని తీసుకున్న ప్రతి సినిమాలో తీసేసి.. వేరే హీరోయిన్స్ తో రీప్లేస్ చేసేవారట. అలా మొదటిసారి మలయాళంలో మోహన్ లాల్ (Mohan Lal) సరసన చక్రం(Chakram) సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో విద్యాబాలన్ కి ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ఆ తర్వాత విద్యాబాలన్ తమిళంలో రన్(Run) మూవీకి తీసుకొని ఆమెను పక్కన పెట్టేసి మీరాజాస్మిన్ (Meera Jasmine)తో రీప్లేస్ చేశారట.అలాగే మనసెల్లం (Manasellam) మూవీలో తీసుకొని మళ్లీ పక్కన పెట్టేసి త్రిష (Trisha)తో రీప్లేస్ చేశారట.

ఇక ఎన్నో తిప్పలు పడి తమిళంలో కళారి విక్రమన్ (Kalari Vikraman) అనే సినిమాలో చేసినప్పటికీ.. ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. దాంతో ఆరంభంలోనే విద్యాబాలన్ కి ఎన్నో ఇబ్బందులు వచ్చి చాలా బాధపడిందట. కానీ ఫైనల్ గా పరిణీత (Parineeta) సినిమాతో బాలీవుడ్ రంగంలోకి అడుగు పెట్టింది.ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలు వరుసగా హిట్స్ కొట్టడంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ALSO READ:Shahrukh Khan: బాధ తట్టుకోలేక టాయిలెట్ లో ఏడ్చిన షారుఖ్.. అసలేమైందంటే?

Related News

Bahubali: The Eternal War: బాహుబలి మరణం.. ముగింపు కాదు!

The Girl Friend Censor : మూవీలో దారుణమైన లిప్ కిస్ సీన్స్… కత్తిరించేసిన సెన్సార్..

Manchu Manoj: రాజ్యం లేదు కానీ రాణిలా చూసుకుంటా.. మనసును హత్తుకుంటున్న మనోజ్ మాట!

Dance master: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు..మరీ ఇంత దారుణమా?

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్

Megastar Chiranjeevi : అన్నపూర్ణ స్టూడియోలో మన శంకరవరప్రసాద్ గారు, సినిమా పూర్తయ్యేది అప్పుడే

Sai Durgha Tej : స్టార్డం అంటే హీరోలతో ఫోటోలు దిగడం కాదు, సాయి తేజ్ అలా అనేశాడేంటి?

Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం

Big Stories

×