Shahrukh Khan: బాలీవుడ్ లో ఉన్న దిగ్గజ నటులలో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) కూడా ఒకరు. ఈయనని అందరూ కింగ్ ఖాన్ అంటూ ఉంటారు. అయితే అలాంటి షారుఖ్ ఖాన్ కేవలం సినిమాల్లో హీరోగా రాణించడమే కాదు పలు వ్యాపార ప్రకటనలు కూడా చేస్తూ రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. మరోవైపు కొన్ని బిజినెస్ లు చేస్తూనే ఐపీఎల్ టీమ్ అయినటువంటి కేకేఆర్ కోల్ కత్తా, నైట్ రైడర్స్ (Kolkata Knight riders) జుహీ చావ్లా (Juhi Chawla) తో కలిసి సహ యజమానిగా ఉన్నారు. అయితే 2008 ఐపీఎల్(IPL) ప్రారంభమైనప్పటి నుండి కేకేఆర్ టీమ్ చాలా బలమైన టీమ్గా ఎదిగింది. కేకేఆర్ టీమ్ ఐపీఎల్ లో ఇప్పటికే మూడుసార్లు ట్రోఫీ గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే.
షారుఖ్ ఖాన్ కేకేఆర్ టీమ్ భవిష్యత్తు మార్చింది మేమే – న్యూమరాలజిస్ట్
అయితే తాజాగా ఈ ట్రోఫీ రావడానికి కారణం నేనేనని, నేను చెప్పిన ఒక్క మాట వల్లే కేకేఆర్ భవిష్యత్ మొత్తం మారిపోయి మూడు సార్లు ట్రోఫీ గెలిచింది అంటూ ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్వేతా జుమాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. మరి శ్వేతా జుమాని చెప్పింది నిజమేనా..?ఆమె చెప్పిన మాట వల్లే కేకేఆర్ ట్రోఫీ గెలిచిందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మా సలహా వల్లే కేకేఆర్ మూడుసార్లు ట్రోఫీ గెలిచింది..
ప్రముఖ న్యూమరాలజిస్ట్ అయినటువంటి శ్వేతా జుమాని (Swetha Jumani)తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ ఇప్పటికే మూడుసార్లు ట్రోఫీ గెలిచింది.ఇందులో నా పాత్ర ఉంది.ఎందుకంటే కేకేఆర్(KKR) మాకు క్లయింట్.. కేకేఆర్ ఓనర్ గా ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ నా దగ్గరికి వచ్చి న్యూమరాలజీ సలహా కోరారు. ఆయన అడిగిన సహాయం నేను చేశాను. అయితే ఐపీఎల్ లో ట్రోఫీ గెలవాలంటే ఖచ్చితంగా కేకేఆర్ టీంకి ఉన్న జెర్సీ (T – shirt) మార్చాలని చెప్పాను. అంతేకాదు ఆ జెర్సీలో ఏ రంగు కలయికలు ఉండాలో కూడా పూర్తిగా వివరించాను. నేను చెప్పిన విధంగానే కేకేఆర్ టీంకి జెర్సీని అందించారు. అలా జెర్సీ మార్చాక ఐపీఎల్ లో కేకేఆర్ టీం మూడుసార్లు ట్రోఫీను గెలుచుకుంది.
బాధ తట్టుకోలేక టాయిలెట్ లో ఏడ్చేసిన షారుఖ్ ఖాన్ ..
అయితే గతంలో షారుఖ్ ఖాన్ కేకేఆర్ టీం ఓడిపోయిన ప్రతి సమయంలో ఎవరితో తన బాధ పంచుకోవాలో అర్థం కాక టాయిలెట్ లోకి ఒంటరిగా వెళ్లి ఏడ్చేవాడు. ఇక ఆయన పరిస్థితి అలాగే కేకేఆర్ టీమ్ కి సంబంధించి అన్ని చూసాకే న్యూమరాలజీ (Numerology)ప్రకారం వాళ్ల జెర్సీని గోల్డ్ కలర్ నుండి ఊదా, గోల్డ్ కలర్ కి మార్చమని సలహా ఇచ్చాము. అలా కేకేఆర్ టీం 2010లో తమ జెర్సీని మార్చేశారు అంటూ న్యూమరాలజిస్ట్ శ్వేతా జుమాని తెలియజేసింది.ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో ఇది నిజమేనా అంటూ చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
కేకేఆర్ టీం అందుకున్న ట్రోఫీలు..
ఇక కేకేఆర్ టీమ్ ఇప్పటికే 2012, 2014, 2024 లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ల్ లలో ట్రోఫీ గెలుచుకుంది. చాలాసార్లు ఫైనల్స్ కి కూడా వెళ్ళింది. అలా ఐపీఎల్ లో కేకేఆర్ ఒక బలమైన టీమ్ గా పేరు తెచ్చుకుంది.
ALSO READ:Samantha – Raj: మళ్లీ అడ్డంగా దొరికిపోయిన సమంత -రాజ్.. ఒకే కార్ లో అలాంటి ఫోజులో!