Bhadrakaali trailer:విజయ్ ఆంటోనీ (Vijay Antony) .. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్గా, నటుడిగా , దర్శకుడిగా, గాయకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ‘బిచ్చగాడు’ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ‘భద్రకాళి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘శక్తి తిరుమగణ్’ పేరుతో విడుదల కాంబోతుండగా.. దీనిని తెలుగులో భద్రకాళి అంటూ రిలీజ్ చేస్తున్నారు. అరుణ్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విజయ్ ఆంటోనీ కెరియర్ లో 25వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం సమకూర్చారు. సునీల్ కృపాలాని, తృప్తి రవీంద్ర, సెల్ మురుగన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సెప్టెంబర్ 19వ తేదీన ఘనంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాజకీయ నేపథ్య కథతో ఈ ట్రైలర్ వచ్చినట్లు తెలుస్తోంది. ట్రైలర్ విషయానికి వస్తే.. “అందరూ ఇలాగే తప్పుకుంటే ఎలా ? ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి కదా? ఆకలి ఆకలి అంటే ఎవరూ పెట్టరు. మనమే లాక్కోవాలి” అంటూ విజయ్ చెప్పిన డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్గా నిలిచాయి. సాధారణంగా కథ ఓరియంటెడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే విజయ్ ఆంటోని ఇప్పుడు అదిరిపోయే రాజకీయ నేపథ్యం కలిగిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ భద్రకాళి సినిమా విజయ్ ఆంటోనీకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
also read:Jacqueline Fernandes: చిన్నారికి అరుదైన వ్యాధి.. గొప్ప మనసు చాటుకున్న జాక్వెలిన్..